‘మా’ ఎన్నికల నోటిఫికేషన్‌ – నియమ నిబంధనలు!

ABN , First Publish Date - 2021-09-17T20:27:55+05:30 IST

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (2021 – 2023) ఎన్నికల నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది. అక్టోబర్‌ 10న (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పోలింగ్‌ జరగనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు.

‘మా’ ఎన్నికల నోటిఫికేషన్‌ – నియమ నిబంధనలు!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (2021 – 2023) ఎన్నికల నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది. అక్టోబర్‌ 10న (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పోలింగ్‌ జరగనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. 


ఎన్నికల షెడ్యూల్‌ 

1. ఎనిమిది మంది ఆఫీస్‌ బేరర్స్‌, 18మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్స్‌ కోసం జరిగే ఈ ఎన్నికలకు ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 

2. 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 

3. నామినేషన్‌ ఉపసంహరణకు వచ్చే నెల 1–2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఉంటుంది. 

4. రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.

5. అక్టోబర్‌ 10న ఎన్నికలు, అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను వెల్లడిస్తారు. 


నియమ నిబంధనలు: 

1. ఒక అభ్యర్థి ఒక పోస్ట్‌ కోసమే పోటీ చేయాలి.

2. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయి ఉండి, 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్‌లకు హాజరు కాకపోతే పోటీ చేసే అర్హత ఉండదు. 

3. 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్‌ బేరర్స్‌గా ఉన్న వారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు. 


Updated Date - 2021-09-17T20:27:55+05:30 IST