వాడిని కాదు.. నన్ను కొట్టి చూడు.. : నరేష్‌కు ప్రకాష్ వార్నింగ్

ABN , First Publish Date - 2021-10-10T19:03:11+05:30 IST

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్‌, మంచు విష్ణు ప్యానెల్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది...

వాడిని కాదు.. నన్ను కొట్టి చూడు.. : నరేష్‌కు ప్రకాష్ వార్నింగ్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్‌, మంచు విష్ణు ప్యానెల్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల ముందే కాదు.. ఎన్నికల రోజు కూడా ఇరు ప్యానెళ్ల మధ్య పెద్ద గొడవలే జరుగుతున్నాయి. ముఖ్యంగా విష్ణు ప్యానెల్‌గా మద్దతుగా నిలిచిన నటుడు వీకే నరేష్.. ప్రకాష్ రాజ్ ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగానే విమర్శించుకున్నారు. దీంతో ఇరు ప్యానెళ్ల సభ్యులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రోజులు సినిమాల్లో అంటే రీల్‌లో నటించి మెప్పించిన వీళ్లంతా ఒక్కసారిగా ఇప్పుడు ఇలా రియల్ లైఫ్‌లో హీరోలు, విలన్లుగా యాక్టింగ్ చేసేశారు!. ఇంతకీ వీరిద్దరి మధ్య అసలేం జరిగింది..? ఎందుకు ఇంతలా ఒకరిపై ఒకరు రెచ్చిపోయారు..? ఎవర్ని ఎవరేమన్నారు..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.


అసలేం జరిగింది..!?

ఎవరో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఓటేయడానికి వచ్చారు. ఇంతలో ఆయన్ను గుర్తించిన వీకే నరేష్.. పట్టుకోబోయాడు. దీంతో నరేష్-ప్రకాష్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. అది కాస్తే.. అరే.. ఒరే.. కొడకా  అనుకునే స్థాయికి వెళ్లడం గమనార్హం. ఈ విషయంపై విష్ణు కూడా స్పందించారు. ఆ వ్యక్తి ఎవరు.. ఎందుకొచ్చారు..? అని అడిగితే ప్రకాష్ ప్యానెల్ హడావుడి చేస్తోందని వ్యాఖ్యానించారు.


ఇద్దరి మధ్య ఇలా..!

వీకే నరేష్ : వాడిని పట్టుకోండి.. పట్టుకోండి..

ప్రకాష్ రాజ్ : హేయ్.. వాడిని కాదు.. నన్ను కొట్టి చూడు.. నన్ను కొట్టు.. రారా.. గెలవరా నా మీద.. రేయ్.. నా కొడకా..! 

వీకే నరేష్ : నో కామెంట్స్.. నో ఆర్గ్యుమెంట్స్


ఎంత చెప్పినా వినకుండా..!

ప్రకాష్ రాజ్ ఒక్కసారిగా తన నోటికి పని చెప్పారు. రెచ్చిపోయిన ప్రకాష్‌ను పక్కనే ఉన్న శ్రీకాంత్, ఉత్తేజ్ సముదాయించారు. అయినప్పటికీ ప్రకాష్ ఆగ్రహం చల్లారలేదు. మరింతలా రెచ్చిపోయి నోటి కొచ్చినట్లుగా మాట్లాడేశారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు చేయి చేసుకునేంత పరిస్థితులు రావడంతో పక్కనే ఉన్న నటులు ఇద్దర్నీ తోసేసి పక్కకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వ్యవహారం అటు సోషల్ మీడియాలో.. ఇటు మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో సరిగ్గా వెయ్యి ఓట్లు కూడా లేని ‘మా’ ఎన్నికలు కాస్త ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలను తలపించేలా సీన్లు చోటు చేసుకుంటున్నాయ్. ఇప్పుడే ఇలా ఉందంటే ఇక కౌంటింగ్, రిజల్ట్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో..!

Updated Date - 2021-10-10T19:03:11+05:30 IST