M. Venkaiah Naidu: ‘సీతా రామం’ చిత్ర బృందానికి అభినందనలు

ABN , First Publish Date - 2022-08-18T14:29:29+05:30 IST

మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు (M. Venkaiah Naidu) ‘సీతా రామం’ (Sita Ramam) సినిమా బృందాన్ని అభినందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

M. Venkaiah Naidu: ‘సీతా రామం’ చిత్ర బృందానికి అభినందనలు

మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు (M. Venkaiah Naidu) ‘సీతా రామం’ (Sita Ramam) సినిమా బృందాన్ని అభినందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇటీవల వచ్చిన చిత్రాల్లో ‘సీతా రామం’ అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు థియేటర్స్‌కు రారు అనే మాటను తిప్పికొట్టిన చిత్రాలో ఈ సినిమా కూడా ఒకటి. అద్భుతమైన కథ, ఆహ్లాదకరమైన సన్నివేశాలతో ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) రూపొందించారు.


ఇప్పటికే, పలువురు సినీ ప్రముఖులు ‘సీతారామం’ చిత్రాన్ని చూసి మొత్తం యూనిట్‌మీద ప్రశంసల వర్షం కురిపించారు. కథ, కథనం, నటీనటుల పర్ఫార్మెన్స్, సంగీతం..ఇలా ప్రతీ అంశాన్ని దృష్ఠిలో పెట్టుకొని ప్రతేకంగా పొగిడారు. ఈ క్రమంలోనే మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఈ చిత్రాన్ని వీక్షించిట్టుగా తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.


దీనిలో ఆయన ‘సీతారామం’ చిత్రాన్ని వీక్షించాను. నటీనటుల అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమైంది. సాధారణ ప్రేమ కథలా కాకుండా, దానికి వీర సైనికుని నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ తప్పక చూడదగినది.. అన్నారు. అంతేకాదు, “చాలాకాలం తరువాత ఓ చక్కని సినిమా చూసిన అనుభూతిని ‘సీతారామం’ అందించింది.

రణగొణధ్వనులు లేకుండా, కళ్ళకు హాయిగా ఉండే ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్ర దర్శకుడు శ్రీ హను రాఘవపూడి, నిర్మాత శ్రీ అశ్వినీదత్, స్వప్న మూవీ మేకర్స్ సహా చిత్ర బృందం అందరికీ ప్రత్యేక అభినందనలు’’.. అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ సినిమాలో మలయాళ యువ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న ముఖ్య పాత్రల్లో నటించారు. 





Updated Date - 2022-08-18T14:29:29+05:30 IST