M M Keeravani అస్సలు తగ్గట్లేదుగా..!

ABN , First Publish Date - 2022-07-06T15:07:07+05:30 IST

ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ అయిన రసూల్ పోకుట్టి (Resul Pookutty) ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన 'ఆర్ఆర్ఆర్' (RRR) మూవీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై గత రెండు రోజుల నుంచి

M M Keeravani అస్సలు తగ్గట్లేదుగా..!

ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ అయిన రసూల్ పోకుట్టి (Resul Pookutty) ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన 'ఆర్ఆర్ఆర్' (RRR) మూవీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ సినిమాను రసూల్ ఒక 'గే లవ్ స్టోరీ' అంటూ కామెంట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై విపరీతంగా విమర్శలు వస్తున్నాయి.


ఈ నేపథ్యంలో రసూల్ పోకుట్టి ట్వీట్ కు స్పందిస్తూ 'బాహుబలి' (Bahubali) నిర్మాత శోభు యార్లగడ్డ (Sobhu yarlagadda) గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ ఒక 'గే లవ్ స్టోరీ' అని తాను భావించడం లేదు.. ఒకవేళ అది గే లవ్ స్టోరీ అయినా దీనిలో తప్పేముంది.. అని ట్వీట్ చేశారు. అంతేకాదు, 'నీలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు రావడం నిజంగా శోచనీయం అని కౌంటర్ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై 'ఆర్ఆర్ఆర్' చిత్ర సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి (M M Keeravani) వరుస ట్వీట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కాస్త ఘాటు పదంతో ట్వీట్ చేసి కౌంటర్ ఇచ్చిన కీరవాణి ..వెంటనే దాన్ని డిలీట్ చేశారు.


ఈ క్రమంలోనే తాజాగా మరో ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. 'నాకు ఈ సినిమాలో అల్లూరి గానీ భీమ్ పాత్రలు గానీ కనిపించలేదు.. కూతురు మల్లి ని కలవాలనే తన తల్లి యొక్క దృఢ సంకల్పమే నాకు కనిపించింది. నా కంటి చూపు ఇప్పుడు మెరుగయ్యింది అనుకుంటున్నాను'.. అని సాఫ్ట్ గానే అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు కీరవాణి. దీంతో ఈ తాజా పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. కాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ రూపొందిస్తున్న 'హరిహర వీరమల్లు', తమిళంలో రూపొందుతున్న 'జెంటిల్ మేన్ 2' చిత్రానికి ఆయన సంగీతం అందిస్తున్నారు. ఇవి కాకుండ మరికొన్ని చిత్రాలకు కీరవాణీ సంగీతం అందిస్తున్నారు. 



Updated Date - 2022-07-06T15:07:07+05:30 IST