‘లక్కీ లక్ష్మణ్’ ఫస్ట్ లుక్ వదిలిన Anil Ravipudi

ABN , First Publish Date - 2022-07-07T03:36:37+05:30 IST

దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ (Sohel), మోక్ష (Moksha) జంటగా ఎ.ఆర్. అభి (AR Abhi) దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మిస్తున్న ఔట్ & ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘లక్కీ లక్ష్మణ్’ (Lucky Lakshman). శరవేగంగా

‘లక్కీ లక్ష్మణ్’ ఫస్ట్ లుక్ వదిలిన Anil Ravipudi

దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ (Sohel), మోక్ష (Moksha) జంటగా ఎ.ఆర్. అభి (AR Abhi) దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మిస్తున్న ఔట్ & ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘లక్కీ లక్ష్మణ్’ (Lucky Lakshman). శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమవుతోన్న  ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను.. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్ విడుదల అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర ఫస్ట్ లుక్ చాలా బాగుంది. దర్శక, నిర్మాతలకు ఇది మొదటి చిత్రమైనా చాలా చక్కగా తెరకెక్కించారు. వీరిద్దరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి. నటుడు సోహైల్ నాకు బిగ్ బాస్ నుండి తెలుసు. అతని నటన బాగుంటుంది. ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’’ అన్నారు.


అనంతరం చిత్ర హీరో సోహైల్ మాట్లాడుతూ... ‘‘ఫస్ట్ లుక్ విడుదల చేసి ఆశీర్వదించిన అనిల్ రావిపూడి అన్నకు ధన్యవాదాలు. తను లాంచ్ చేయడంతో మా సినిమా బిగ్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నాము. మా దర్శక, నిర్మాతలకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో.. సినిమా కథలను సెలెక్ట్  చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని కలిగి ఉన్నారు. ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది..’’ అన్నారు. ‘‘నా ఫేవరెట్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడిగారి చేతుల మీదుగా మా ‘లక్కీ లక్ష్మణ్’  ఫస్ట్ లుక్  విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది’’ అని దర్శకుడు అభి తెలపగా.. చిత్ర నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ... ‘‘దర్శకుడు అనిల్ రావిపూడిగారు ఎంతో బిజీగా ఉన్నా మేము అడిగిన వెంటనే మా చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. వారికి మా ధన్యవాదాలు. చిత్ర మోషన్ పోస్టర్ చూసిన ప్రేక్షకుల నుండి.. ఒక మంచి కాఫీ లాంటి సినిమాను ఇస్తారనే కామెంట్స్ రావడంతో మాకది ఎంతో ఎనర్జీని ఇచ్చినట్లు అయ్యింది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను తెలియజేస్తాము..’’ అని అన్నారు.



Updated Date - 2022-07-07T03:36:37+05:30 IST