కొత్త కొత్తగా..

ABN , First Publish Date - 2022-12-10T06:18:17+05:30 IST

ప్రముఖ దర్శకుడు దశరథ్‌ నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌ యూ రామ్‌’. డివై చౌదరి దర్శకుడు. రోహిత్‌ బెహల్‌, అపర్ణ జనార్థనన్‌ జంటగా నటించారు.

కొత్త కొత్తగా..

ప్రముఖ దర్శకుడు దశరథ్‌ నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌ యూ రామ్‌’. డివై చౌదరి దర్శకుడు. రోహిత్‌ బెహల్‌, అపర్ణ జనార్థనన్‌ జంటగా నటించారు. శుక్రవారం హైదరాబాద్‌లో టీజర్‌ని దర్శకుడు హరీశ్‌ శంకర్‌, సాంగ్‌ టీజర్‌ని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఆవిష్కరించారు. ‘‘తప్పకుండా ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకొంటుంద’’న్నారు పువ్వాడ అజయ్‌ కుమార్‌. ‘‘టీజర్‌ వినోదాత్మకంగా, దశరథ్‌ స్టైల్‌లో సాగిపోయింద’’న్నారు హరీశ్‌ శంకర్‌. ‘‘కొత్త కొత్తగా సాగే కథ ఇది. ఈ చిత్రంలో పని చేసిన వాళ్లంతా డబ్బు కోసం కాకుండా నా కోసం కష్టపడ్డార’’ని దశరథ్‌ తెలిపారు. 

Updated Date - 2022-12-10T06:18:17+05:30 IST