నచ్చావ్‌ అబ్బాయ్‌

ABN , First Publish Date - 2022-08-16T05:37:40+05:30 IST

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. శ్రీధర్‌ గాదె దర్శకుడు...

నచ్చావ్‌ అబ్బాయ్‌

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. శ్రీధర్‌ గాదె దర్శకుడు. దర్శకుడు కోడి రామకృష్ణ తనయ కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. సంజనా ఆనంద్‌ కథానాయిక. ఈ చిత్రం సెప్టెంబరు 9న విడుదలవుతోంది. ఈ చిత్రంలోని ‘నచ్చావ్‌ అబ్బాయ్‌’ అంటూ సాగే మాస్‌ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. భాస్కరభట్ల రచించిన ఈ గీతాన్ని ధనుంజయ, లిప్సిక ఆలపించారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు.


Updated Date - 2022-08-16T05:37:40+05:30 IST