ఆ మండపంలోనే Nayanthara, విఘ్నేశ్ శివన్‌ల పెళ్లి

ABN , First Publish Date - 2022-06-08T23:59:28+05:30 IST

సెలబ్రిటీ లవ్‌బర్డ్స్ నయనతార (Nayanthara), విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) పెళ్లి (Wedding) చేసుకొబోతున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

ఆ మండపంలోనే Nayanthara, విఘ్నేశ్ శివన్‌ల పెళ్లి

సెలబ్రిటీ లవ్‌బర్డ్స్ నయనతార (Nayanthara), విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)లు పెళ్లి (Wedding) చేసుకొబోతున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ జంట పెళ్లి మహాబలిపురంలోని ప్రముఖ రిసార్ట్‌లో జూన్ 9న జరగబోతుంది. విక్కీ కౌశల్-కత్రినా కైఫ్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల పెళ్లిలను నిర్వహించిన వెడ్డింగ్ ప్లానర్సే నయన్-విఘ్నేశ్‌ల వివాహానికి ఇన్‌ఛార్జిగా వ్యవహారించబోతున్నారని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. 


పెళ్లి తేదీ దగ్గరపడటంతో నయనతార- విఘ్నేశ్ శివన్ అందరికీ ఆహ్వానాలు పంపిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్‌ను ఈ జంట తమ వివాహానికి ఆహ్వానించారు. ‘‘పెళ్లికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకాబోతున్నారు. ఈ జంట మహాబలిపురంలోని రిసార్ట్‌ను మూడు రోజుల పాటు బుక్ చేసుకుంది. జూన్ 9న ఉదయం 8.30గంటల నుంచి పెళ్లి పనులు ప్రారంభం అవుతాయి. ఈ వివాహానికి ముందు రోజే సంగీత్, మెహందీ వేడుకలు నిర్వహిస్తారు. గ్లాస్‌హౌస్ మండపంలో వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే మండపానికి సంబంధించిన పనులను ప్రారంభించారు’’ అని నయనతారతో సన్నిహితంగా మెలిగేవారు చెప్పారు. నయన్, విఘ్నేశ్ తమ పెళ్లి వీడియో హక్కులను స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌కు భారీ మొత్తానికి విక్రయించినట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ (Gautham Menon) ఈ వివాహ వేడుకను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఈ వివాహానికి విజయ్ సేతుపతి, రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్, సూర్య వంటి ప్రముఖులు అతిథులుగా హాజరుకాబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-06-08T23:59:28+05:30 IST