100 మంది ఆర్టిస్టులతో ‘Lots of love’.. వారికి అంకితం

ABN , First Publish Date - 2022-06-21T02:45:48+05:30 IST

ప్రణవి పిక్చర్స్ పతాకంపై.. ఎస్ ఎమ్ వి ఐకాన్ ఫిలిమ్స్ సంస్థ నిర్మాణంలో అనిత మరియు ప్రఖ్యాత్ సమర్పిస్తున్న చిత్రం ‘లాట్స్ ఆఫ్ లవ్’ (Lots of love). ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, పాటలు, నిర్మాత, దర్శకత్వం డా. విశ్వానంద్ పటార్. ఈ చిత్ర ఆడియో

100 మంది ఆర్టిస్టులతో ‘Lots of love’.. వారికి అంకితం

ప్రణవి పిక్చర్స్ పతాకంపై.. ఎస్ ఎమ్ వి ఐకాన్ ఫిలిమ్స్ సంస్థ నిర్మాణంలో అనిత మరియు ప్రఖ్యాత్ సమర్పిస్తున్న చిత్రం ‘లాట్స్ ఆఫ్ లవ్’ (Lots of love). ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, పాటలు, నిర్మాత, దర్శకత్వం డా. విశ్వానంద్ పటార్. ఈ  చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్‌లో మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లు రామకృష్ణ, దర్శకుడు వీరశంకర్, జెడి మోహన్ గౌడ్, ప్రసన్నకుమార్, ప్రతాని రామకృష్ణ గౌడ్, శ్రీరంగం సతీష్ వంటివారు హాజరై.. పాటలను ఆవిష్కరించగా.. చిత్ర టీజర్‌ను నటి అనితా షిండే,  ట్రైలర్‌ను మిస్ ఊటీ అనన్య అగర్వాల్ విడుదల చేశారు.


అనంతరం ముఖ్య అతిథి కొల్లు రామకృష్ణ మాట్లాడుతూ..  ఈ చిత్రానికి దర్శకత్వం వహించి నటించి నిర్మించిన విశ్వ..  సాఫ్ట్‌వేర్ రంగం నుంచి చిత్ర రంగానికి మంచి ప్యాషన్‌తో వచ్చారు. ట్రైలర్, సాంగ్స్, టీజర్ చాలా బాగున్నాయి. ఈ సినిమాతో అందరికీ మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను..’’ అని అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డా. బికె కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానే కాకుండా ఈ సినిమాలో నేను కూడా నటించడం జరిగింది. సాంగ్స్ బాగున్నాయి.. ఆర్టిస్టులందరూ ఎంతో సహకరించారు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వమే కాకుండా నిర్మించి నటించిన విశ్వగారి గురించి చెప్పాలంటే.. సినిమా అంటే ఆయనకి ప్యాషన్. అంతేకాదు.. ఎంతో మందికి ఆయన సహాయ సహకారాలు అందించారు. కోవిడ్ టైంలో 400 మందికి రోజూ అన్నం పెట్టేవారు. సహాయం కోరి వచ్చిన వారందరికీ ఆయన లేదనకుండా సాయం చేసేవారు. కానీ ఎవరికీ చెప్పుకోరు. అలాంటి మంచి మనసున్న వ్యక్తి తీసిన ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు.  


దర్శకనిర్మాత విశ్వానంద్ (Viswanand) మాట్లాడుతూ.. ‘‘మనం పుట్టినప్పటి నుంచి మనచుట్టూ ఎంతో ప్రేమను చూస్తూ ఉంటాము. అలా విభిన్నమైన 4 జంటల మధ్య ఉండే, జరిగే ప్రేమ కథాంశంమే మా ఈ ‘లాట్స్ ఆఫ్ లవ్’. ఈ సినిమాలో 100 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరినీ మ్యానేజ్ చేయడం కష్టమైనా.. వారందరి సహకారంతో సినిమా పూర్తి చేయగలిగాము. ఈ చిత్రాన్ని కోవిడ్ టైంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన డాక్టర్స్‌కు, నర్సులకు, వ్యాక్సిన్ కనుగొన్న  సైంటిస్టులకు అంకితం ఇస్తున్నా. అన్నీ కుదిరితే వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం..’’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-21T02:45:48+05:30 IST