LCUలో భాగంగా Thalapathy Vijay 67 మూవీ..! విక్రమ్ దర్శకుడు Lokesh Kanagaraj ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2022-06-21T23:20:57+05:30 IST

లోకేశ్ కనగరాజ్.. ఈ తమిళ దర్శకుడి గురించే ప్రస్తుతం దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. దానికి కారణం..

LCUలో భాగంగా Thalapathy Vijay 67 మూవీ..! విక్రమ్ దర్శకుడు Lokesh Kanagaraj ఏమన్నాడంటే..

లోకేశ్ కనగరాజ్.. ఈ తమిళ దర్శకుడి గురించే ప్రస్తుతం దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. దానికి కారణం.. ఆయన దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా నటించిన ‘విక్రమ్’ సూపర్ హిట్‌గా నిలవడమే. అంతేకాకుండా ఈ సినిమాతో హాలీవుడ్ సినిమాలు మార్వెల్ కామిక్ యూనివర్స్, డీసీ ఎక్స్‌టెండెట్ యూనివర్స్ తరహాలో ప్రత్యేకంగా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌ (LCU)ని సృష్టించాడు. అలాంటి ప్రయత్నం చేసిన తొలి సౌత్ ఇండియన్ డైరెక్టర్ లోకేశ్ కావడం ఇక్కడ విశేషం.


‘విక్రమ్’ సినిమాలో లోకేశ్ దర్శకత్వంలో వహించిన కార్తీ (Karthi) చిత్రం ‘ఖైదీ’లోని హీరో క్యారెక్టర్ ఢిల్లీతో పాటు పలు ఇతర పాత్రలు కనిపిస్తాయి. దీంతో ఆ సినిమాకి ఈ సినిమాకి ఉన్న రిలేషన్ ఎంటీ అంటూ లోకేశ్ తదుపరి చిత్రాలపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ తరుణంలో ఈ యంగ్ డైరెక్టర్ మరో తమిళ హీరో విజయ్‌తో ఓ సినిమాని ప్రకటించాడు. దళపతి 67 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే.. తాజాగా ఈ మూవీ సైతం LCUలో ఓ భాగమని ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్‌పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో లోకేశ్ స్పందించాడు.


లోకేశ్ మాట్లాడుతూ.. ‘Thalapathy67 ప్రత్యేక మూవీగా ఉంటుందా లేక LCUలో భాగమవుతుందా అనేది త్వరలో అందరికీ తెలియజేస్తాను. ప్రస్తుతానికి దీన్ని ఓ ఇంటెన్స్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాను. ఈ మూవీ స్క్రిప్ట్ నా హృదయానికి హత్తుకుంది’ అని చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్య్వూకి సంబంధించిన వీడియోని ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేష్ బాలా ట్వీట్ చేశాడు. దీంతో వీరి ఫ్యాన్స్ ఎంతో యాగ్జాయిట్‌మెంట్‌తో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈ ప్రచారం నిజమై ఈ మూవీ ఎల్‌సీయూలో భాగమైతే అప్పటి వరకూ ఉన్న చాలా రికార్డులు బద్దలైనట్లేనని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నెటిజన్లు ఈ పోస్ట్‌పై స్పందిస్తూ.. ‘కమల్ హాసన్, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తీ, విజయ్.. వెయ్యికోట్ల సినిమా లోడ్ అవుతోంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు.



Updated Date - 2022-06-21T23:20:57+05:30 IST