Bollywood: వచ్చే ఏడాదే ఈ సెలబ్రిటీ కిడ్స్ బాలీవుడ్ ఎంట్రీ

ABN , First Publish Date - 2022-12-06T01:54:42+05:30 IST

బాలీవుడ్ సెలబ్రిటీలకు విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ ఉంటుంది. తల్లిదండ్రుల మాదిరిగానే వీరి పిల్లలకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరగడంతో వీరు ఇండస్ట్రీనే కెరీర్‌గా ఎంచుకుంటుంటారు.

Bollywood: వచ్చే ఏడాదే ఈ సెలబ్రిటీ కిడ్స్ బాలీవుడ్ ఎంట్రీ

బాలీవుడ్ సెలబ్రిటీలకు విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ ఉంటుంది. తల్లిదండ్రుల మాదిరిగానే వీరి పిల్లలకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరగడంతో వీరు ఇండస్ట్రీనే కెరీర్‌గా ఎంచుకుంటుంటారు. హీరో, హీరోయి‌న్‌గా రాణించడానికి ప్రయత్నిస్తుంటారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ ఇండస్ట్రీ అందుకు మినహాయింపు కాదు. బీ టౌన్‌కి 2023లో అనేక మంది సెలబ్రిటీ కిడ్స్ ఎంట్రీ ఇవ్వనున్నారు. వారిపై ఓ లుక్కేద్దామా మరి.. 


సుహానా ఖాన్ (Suhana Khan): 

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కుమార్తెనే సుహానా ఖాన్. ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ కవర్ పేజీపై 2018లో కనిపించి బీ టౌన్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసుకుంది. ప్రతిష్ఠాత్మక న్యూయార్క్ యూనివర్శిటీ నుంచి డ్రామా కోర్సును పూర్తి చేసింది. జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్న ‘ది అర్చీస్’ తో వెండి‌తెర పైకి రంగ ప్రవేశం చేయనుంది. 1960ల నేపథ్యంలో ఈ స్టోరీ కొనసాగనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ షో ప్రసారం కానుంది.


అగస్త్య నందా (Agastya Nanda): 

అమితాబ్ మనవడే అగస్త్య నందా. జోయా అక్తర్ ‘ది అర్చీస్’ తోనే బీ టౌన్‌కు ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ కామికల్ సిరీస్‌లోనే ముఖ్యమైన పాత్ర అయిన అర్చీ రోల్‌ను పోషించనున్నాడు. ‘ది అర్చీస్’ లో మిహిర్ అహుజ, వేదాంగ్ రైనా, యువరాజ్ మెండా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఖుషి కపూర్ (Khushi Kapoor):

శ్రీదేవి, బోనీ కపూర్‌ల ముద్దుల కుమార్తెనే ఖుషి కపూర్. ఇప్పటికే ఖుషి సోదరి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఖుషి కూడా ‘ది అర్చీస్’ తోనే బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది. అర్చీ సన్నిహితురాలి పాత్రను ఆమె పోషించనుంది. 


పష్మీనా రోషన్ (Pashmina Roshan):

బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ రోషన్ కుమార్తెనే పష్మీనా రోషన్. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌కు మేనకోడలు ఆమె. రొమాంటిక్ కామెడీ ‘ఇష్క్ విష్క రీ బౌండ్’ తో వెండితెర పైకి పష్మీనా ఎంట్రీ ఇవ్వనుంది. 2003లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘ఇష్క్ విష్క్’ కు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందనుంది.


జునైద్ ఖాన్ (Junaid Khan):

బీ టౌన్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కుమారుడే జునైద్ ఖాన్. అతడిని బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంచ్ చేయనుంది. జునైద్ మహారాజా సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. పిరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది.


Updated Date - 2022-12-06T01:54:42+05:30 IST