తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2022-11-27T13:47:10+05:30 IST

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు...

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. నవంబర్ 26న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


The Legend of Loulan: Ghost Army (ది లెజెండ్ ఆఫ్ లౌలన్: ఘోస్ట్ ఆర్మీ)

యువ పురావస్తు శాస్త్రవేత్త వు టియాన్ నిజాయతీపరుడు. ఎడారిలో లౌలాన్ కాంస్య అద్దాన్ని కనుగొంటాడు. అది లౌలన్ నాగరికతకి సంబంధించిన నిధి. దాన్ని రక్షించడానికి, విదేశీ దొంగల చేతుల్లో పడకుండా నిరోధించడానికి అతను ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నంలో వెయ్యి సంవత్సరాల నాటి రహస్యమైన ‘ఘోస్ట్ ఆర్మీ’కి సంబంధించిన రహస్యాలను వెలికితీస్తాడు. ఈ తరుణంలో అతనికి ఎదురైన సంఘటనల సమాహారమే ‘ది లెజెండ్ ఆఫ్ లౌలన్: ఘోస్ట్ ఆర్మీ’. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.




The Island of Snake King (ది ఐలాండ్ ఆఫ్ స్నేక్ కింగ్)

స్నేక్ కింగ్ ఐలాండ్‌ని రియల్ ఎస్టేట్ డెవలపర్లు కొనుగోలు చేస్తారు. బ్లాక్ మార్కెట్ స్నేక్ హంటింగ్ గ్యాంగ్‌కు కూడా అక్కడికి వచ్చిన పాములను పడుతుంది. వారికి వ్యతిరేకంగా పోరాడటానికి స్నేక్ కింగ్ వారసులు జంతు సంరక్షణ నిపుణులతో కలిసి పని చేస్తారు. ఈ తరుణంలో వారికి ఎదురైన సంఘటన సమాహారమే ‘ది ఐలాండ్ ఆఫ్ స్నేక్ కింగ్’ చిత్ర కథాంశం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)

Ek Chup - హిందీ


నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Weather for Two - ఇంగ్లిష్


అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

Halloween Ends - ఇంగ్లిష్


ప్లానెట్ మరాఠీ ఓటీటీ (Planet Marathi OTT)

Athang - మరాఠీ


అదర్ (Other)

Brother Zova - ఇంగ్లిష్



Updated Date - 2022-11-27T13:47:10+05:30 IST