తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

Twitter IconWatsapp IconFacebook Icon
తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


బుజ్జి ఇలారా (Bujji... Ila Raa)

వరుసగా జరుగుతున్న 8 ఏళ్ల బాలికల కిడ్నాప్‌లు, హత్యలు వరంగల్ పోలీసు శాఖకు గట్టి సవాలుగా నిలుస్తున్నాయి. విచారణ అధికారి ప్రమాదానికి గురైన తర్వాత, ముహమ్మద్ ఖయ్యూమ్ ఆ స్థానంలోకి వస్తాడు. అతను హత్యల వెనుక ఉన్న మర్మాన్ని ఛేదించగలిగడా లేదా అని చిత్ర కథాంశం. గరుడవేగ అంజి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్, ధన్‌రాజ్ కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..


నచ్చతిరమ్ నగర్‌గిరదు (Natchathiram Nagargiradhu)

నచ్చతిరమ్ నగర్‌గిరదు (నక్షత్రం కదులుతోంది) అనేది 2022లో విడుదలైన భారతీయ తమిళ రొమాంటిక్ సంగీత చిత్రం. దీనికి కబాలి ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వం వహించారు. దుషార విజయన్, కలైయరసన్, కాళిదాస్ జయరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీత స్వరకర్తగా టెన్మాను పని చేశారు. ఈ చిత్రంలో సిల్వియా పాత్ర పోషించిన ట్రాన్స్‌జెండర్ నటి షెరిన్ సెలిన్ మాథ్యూ 17 మే 2022న కొచ్చిలో ఆత్మహత్య చేసుకుంది. 31 ఆగస్టు 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ మూవీ విడుదలైంది. విడుదలైన ప్రతి చోట విమర్శకులు, ప్రేక్షకుల నుంచి సానుకూల సమీక్షలను అందుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

Inside The Worlds Toughest Prisons Season 6 - ఇంగ్లిష్

Too Hot to Handle: Brazil Season 2 - ఇంగ్లిష్

Eat the Rich: The GameStop Saga - ఇంగ్లిష్

Blonde - ఇంగ్లిష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)

Reasonable Doubt - ఇంగ్లిష్


మూబీ (Mubi)

Wood and Water - ఫ్రెంచ్

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.