తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

Twitter IconWatsapp IconFacebook Icon
తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.


కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తు అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


ఫుల్‌మెటల్ ఆల్కెమిస్ట్ : ది ఫైనల్ ఆల్కెమీ (Fullmetal Alchemist: The Final Alchemy)

‘ఫుల్‌మెటల్ ఆల్కెమిస్ట్ : ది ఫైనల్ ఆల్కెమీ’ అనేది జపనీస్ చిత్రం. ఫుల్‌మెటల్ ఆల్కెమిస్ట్ ట్రయాలజీ సినిమాల్లో చివరి చిత్రం. ఆల్కెమిస్ట్ ఎడ్వర్డ్ ఎల్రిక్, అతని సోదరుడు ఆల్ఫోన్స్ ఇద్దరు చేస్తున్న ప్రయాణం ఈ సినిమాతో ముగుస్తుంది. ఫుల్‌మెటల్ ఆల్కెమిస్ట్‌ సిరీస్‌లో మూడోదైన ‘ఫుల్‌మెటల్ ఆల్కెమిస్ట్ : ది ఫైనల్ ఆల్కెమీ’లో ఆ సోదరులు ప్రంపచాన్ని ముప్పు నుంచి కాపాడతారు. ఫుల్‌మెటల్ ఆల్కెమిస్ట్ మూడో భాగం కూడా ముందు రెండు భాగాలలాగే హృదయాన్ని కలచివేసేలా ఉంటుంది. ఈ మూవీ చాలా థ్రిల్లింగ్ అంశాలను కలిగి ఉండి, ప్రేక్షకులను సీటు చివరిలో కూర్చునేలా చేస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..


లవ్ ఎట్‌ ఫిఫ్త్ ఫ్లోర్ (Love At 5th Floor)

ఒకరోజు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని ఐదో అంతస్తులోని ల్యాప్‌టాప్‌లో షాకింగ్ వీడియో బయటపడుతుంది. దాని కారణంగా ఓ ముగ్గురు మహిళల జీవితాలు మలుపు తిరుగుతాయి. యువ తల్లి, ఓ కంపెనీ సీఈవో, ఓ పాలీమరస్ ప్రొఫెసర్‌ల జీవితాల్లో ప్రమాదంలో పడతాయి. వాటి నుంచి ఆ ముగ్గురు మహిళలు ఎలా బయటపడ్డారనేది ఈ చిత్ర కథాంశం. నిషు దిక్షిత్, రచనా గుప్తా, దిల్నాజ్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషిచారు. ఈ టీవీ షో ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది.


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar)

Is it Love? Or Convenience?... - హిందీ

Zindagi 1 tsp - హిందీ


వూట్ (Voot)

Shark Tank Season 14 - ఇంగ్లిష్


నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Dynasty Season 5 - ఇంగ్లిష్


సోనీ లివ్ (Sony Liv)

Deadly Predators - ఇంగ్లిష్

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.