తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2022-11-10T13:47:32+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి...

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. నవంబర్ 9న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


ది సాకర్ ఫుట్ బాల్ మూవీ (the soccer football movie)

నలుగురు స్నేహితులకి ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టం. వారికి ఇష్టమైన ఆటగాళ్లు అనుకోకుండా ఫామ్ కోల్పోతారు. వాటిని ఓ చెడ్డ సైంటిస్ట్ దొంగిలిస్తాడు. ఈ నలుగురు కలిసి ఆ ఆటగాళ్ల టాలెంట్ ను తిరిగి వచ్చేలా చేస్తారు. ఈ తరుణంలో వారికి ఎదురైన సమస్యల సమాహారమే ది సాకర్ ఫుట్ బాల్ మూవీ. ఈ యానిమేటెడ్ సినిమాకి మిచ్ శ్చౌర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


గుడ్ మౌర్నింగ్ (Good mourning)

గుడ్ మౌర్నింగ్ అనేది 2022లో విడుదలైన అమెరికన్ స్టోనర్ కామెడీ చిత్రం.  కాల్సన్ బేకర్, మోడ్ సన్ దర్శకత్వం వహించి, నిర్మించారు. ఇందులో బెకీ జి, మేగాన్ ఫాక్స్, డోవ్ కామెరాన్‌, జాక్ విల్లా, గాటా కీలక పాత్రల్లో నటించారు. మే 20, 2022న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.


లండన్ అనే యువకుడిని నటి అయిన తన ప్రేమికురాలు నుంచి గుడ్ మౌర్నింగ్ అనే మెసేజ్ వస్తుంది. దాని అర్ధం తెలియక ఆమెకి కాల్ చేసిన లిఫ్ట్ చేయదు. దాంతో.. దాని అర్ధం తెలుసుకోవడానికి తన నలుగురు స్నేహితులతో కలిసి చేసే ప్రయత్నమే ఈ చిత్రం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


నెట్ ఫ్లిక్స్ (Netflix)

FIFA Uncovered - ఇంగ్లిష్

The Crown Season 5 - ఇంగ్లిష్

Till Death Season 2 - అవరిక్


అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

Breathe: Into The Shadows Season 2 - హిందీ

Savage X Fenty Show Vol.4 - ఇంగ్లిష్


డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney plus Hotstar)

Dum Laga Ke India - హిందీ

G'day - ఇంగ్లిష్

Save our squad - ఇంగ్లిష్

Zootopia+ - ఇంగ్లిష్





Updated Date - 2022-11-10T13:47:32+05:30 IST