తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2022-11-06T14:09:40+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి..

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా నవంబర్ 5న విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


షూటర్ (Shooter)

దిల్షేర్ సింగ్, ఖుష్పాల్ సింగ్ దర్శకత్వం వహించిన పంజాబీ యాక్షన్ చిత్రం షూటర్. ఈ మూవీకి మొదటసుఖా కహ్లోన్ అని పేరు పెట్టారు. జై రాంధవా, స్వాలినా, వడ్డా గ్రేవాల్ ముఖ్యపాత్రలు పోషించారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా 21 ఫిబ్రవరి 2020న విడుదల కావాల్సి ఉంది. హింసను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణతో అప్పటి పంజాబ్ గవర్నమెంట్ ఈ మూవీని పంజాబ్‌లో నిషేధించారు. అదే కారణంతో హర్యానాలో 21 ఆగస్టు 2021న సినిమాను నిషేధించారు. ఈ సినిమాపై నిషేధం గురించి పంజాబీ సినిమా ఇండస్ట్రీలో భిన్న అభిప్రాయాలను వినిపించాయి. ఇది చివరకు 14 జనవరి 2022న థియేటర్లలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అదర్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


కపుల్ గోల్స్ సీజన్ 3 (Couple Goals Season 3)

జెన్నీ అనే అమ్మాయికి అనుకోకుండా ఎదురైన సంఘటనతో ఇబ్బంది పడుతుంది. అప్పుడే ఆయుష్‌ అనే యువకుడితో గొడవ అవుతుంది. అనంతరం ఇద్దరు కలిసి జెన్సీ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఆ తరుణంలో వారికి ఎదురైన సంఘటనల సమాహారమే ఈ వెబ్‌సిరీస్. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)

Feeki Shakkar - హిందీ

Adhikar - హిందీ

Vighnaharta - హిందీ

Mard with no Dard - హిందీ


నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Orgasm Inc: The Story of One Taste - ఇంగ్లిష్


సోనీ లివ్ (Sony LIV)

Earth's Great Rivers II - ఇంగ్లిష్





Updated Date - 2022-11-06T14:09:40+05:30 IST