తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2022-09-30T15:52:35+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా సెప్టెంబర్ 29న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


బుల్లెట్ ట్రైన్ (Bullet Train)

బుల్లెట్ ట్రైన్.. 2022 అమెరికన్ యాక్షన్ కామెడీ చిత్రం. డేవిడ్ లీచ్ దర్శకత్వం వహించగా.. ఆంటోయిన్ ఫుక్వా నిర్మించారు. కోతారో ఇసాకా 2010లో రచించిన నవల ‘మరియా బీటిల్’ ఆధారంగా తెరకెక్కించారు. ఓ హంతకుడు ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు తోటి కిల్లర్స్‌తో ఫైట్ చేయాల్సి వస్తుంది. వారి మీద అతను విజయం సాధించాడా.. లేదా.. అనేదే చిత్ర కథాంశం. ఈ మూవీలో బ్రాడ్‌పిట్ లీడ్‌ రోల్‌లో నటించాడు. జోయి కింగ్, ఆరోన్ టేలర్-జాన్సన్, బ్రియాన్ టైరీ హెన్రీ, ఆండ్రూ కోజి, హిరోయుకి సనాడా, మైఖేల్ షానన్, బాడ్ బన్నీ, లోగాన్ లెర్మాన్, సాండ్రా బుల్లక్ ఇతర కీలకపాత్రల్లో నటించారు. ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం.. 90 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా 230 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, బుక్ మై షో, జీ5‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


మనే లై జా (Mane Lai Ja)

మనే లై జా అనేది 10 ఏళ్ల బాలిక ఆనంది అనే అమ్మాయి కథ ఆధారంగా తెరకెక్కిన గుజరాతీ చిత్రం. వినోదంతోపాటు.. ఈ చిత్రం సమాజానికి సామాజిక సందేశాన్ని కూడా అందిస్తుంది. మన సంస్కృతిలోని భయంకరమైన ఆచారాలను ప్రశ్నిస్తుంది. నిరంజన్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా పదియార్, మమతా సోలంకీ, ప్రతీశ్ వోరా, భావిని జాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ షామారో మీలో స్ట్రీమింగ్ అవుతోంది.


నెట్‌ఫ్లిక్స్ (Netflix)

After Ever Happy - ఇంగ్లిష్

The Empress - జర్మన్





Updated Date - 2022-09-30T15:52:35+05:30 IST