తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2022-09-12T15:58:59+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.


కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా సెప్టెంబర్ ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


విరుమాన్ (Viruman)

విరుమాన్ అనేది 2022లో విడుదలైన తమిళ భాషా మసాలా చిత్రం. ఎమ్.ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2D ఎంటర్‌టైన్‌మెంట్‌పై జ్యోతిక, సూర్య నిర్మించారు. ఇందులో కార్తీ, డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ జంటగా నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 12 ఆగస్టు 2022న థియేటర్లలో విడుదలై కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.


నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Thallumaala - మలయాళం


ఆహా వీడియో (Aha Video)

Dance Ikon - తెలుగు



Updated Date - 2022-09-12T15:58:59+05:30 IST