RRR, Acharya సినిమాలే కాదు.. మే 20న OTT ల్లో విడుదల కానున్న క్రేజీ సినిమాలివే..!

ABN , First Publish Date - 2022-05-19T15:06:54+05:30 IST

థియేటర్స్‌లో ప్రతి శుక్రవారం లేదా ఒక రోజు అటుఇటుగా సినిమాలు విడుదల చేస్తే వారాంతం వల్ల సినిమా కలెక్షన్లు...

RRR, Acharya సినిమాలే కాదు.. మే 20న OTT ల్లో విడుదల కానున్న క్రేజీ సినిమాలివే..!

థియేటర్స్‌లో ప్రతి శుక్రవారం లేదా ఒక రోజు అటుఇటుగా సినిమాలు విడుదల చేస్తే వారాంతం వల్ల సినిమా కలెక్షన్లు బావుంటాయి. అందుకే ఆ రోజుల్లోనే ఒకేసారి ఒకటికి మించిన మూవీస్‌ని రిలీజ్‌ అవుతుంటాయి. అయితే OTTల్లో పరిస్థితి అలా ఉండదు. వాటిలో ఏ రోజు విడుదల చేసిన వచ్చే వ్యూస్ వస్తూనే ఉంటాయి. అందుకే ప్రతిరోజు కొన్ని సినిమాలను ఈ ఫ్లాట్‌పామ్‌లు విడుదల చేస్తాయి. అయితే.. మే 20న మాత్రం వీటికి విరుద్ధంగా ఒకేసారి తెలుగుతోపాటు పలు భారతీయ భాషల్లో క్రేజీ మూవీస్ విడుదల కానున్నాయి. అందులో RRR, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ వంటి సినిమాలు ఉండడం విశేషం. కాగా.. పలు భాషల్లో విడుదల కానున్న మూవీస్ గురించి తెలుసుకుందాం..


1. RRR

తెలంగాణకి చెందిన విప్లవ వీరుడు కొమురం భీమ్, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు మధ్య స్నేహ ప్రధానంగా సాగే చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్ నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకొంది. ఈ మూవీ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్లు జీ5 ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కానున్నాయి.


2. ఆచార్య

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీలో రామ్‌చరణ్ ఓ ముఖ్య పాత్రలో నటించాడు. ఏప్రిల్ 29న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. తాజాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.


3. జెర్సీ

ఓ మాజీ క్రికెటర్, తన కొడుకు కోరిక మేరకు మళ్లీ క్రికెట్ ఆడటం.. అనంతరం జరిగిన పరిణామాలపై షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. తెలుగులో నాని హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘జెర్సీ’కి ఇది రిమేక్. మాతృకకి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి దీనికీ డైరెక్టర్. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, పంకజ్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.


4. 12th మ్యాన్

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన చిత్రం ‘12th మ్యాన్’. పదకొండు మంది క్లాస్‌మేట్స్ రియూనియన్‌లో భాగంగా రోడ్ ‌ట్రిప్‌కి వెళ్లగా.. 12వ మనిషి వచ్చి వారిలో చేరతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా కథాంశం. ఈ మూవీలో ఉన్ని ముకుందన్, సైజు కురుప్, శివద, అను సితార, అనుశ్రీ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా డైరెక్ట్‌గా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.



Updated Date - 2022-05-19T15:06:54+05:30 IST