Aishwarya Rai to Priyanka Chopra: కెరీర్‌లో హిట్లకంటే ఎక్కువ ఫ్లాపులు ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ వీరే..

Twitter IconWatsapp IconFacebook Icon

సినిమా ఇండస్ట్రీలో హిట్లు, ఫ్లాపులు సహజమే. అయితే దానిమీదే నటీనటుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయితే కొంతమంది జయాపజయాలకు అతీతంగా కెరీర్‌లో దూసుకుపోతూ ఉంటారు. అలా వచ్చిన సినిమాల్లో ఎక్కువ ఫ్లాపులు ఉన్నప్పటికీ బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్స్‌గా చెలామణి అయిన, అవుతున్న నటీమణులు వీరే..

ఐశ్వర్యరాయ్ బచ్చన్..

బాలీవుడ్‌లో అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ (Aishwarya Rai Bachchan)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌తో పెళ్లి తర్వాత దాదాపు సినిమాలకి దూరమైనప్పటికీ ఈ భామ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే ఈ బ్యూటీ తన కెరీర్‌లో నటించిన సినిమాల్లో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ ఉండడం గమనార్హం. ఐశ్వర్య రాయ్ బాలీవుడ్‌లో ఇప్పటివరకూ 31 సినిమాలు చేయగా.. అందులో కేవలం 4 మాత్రమే హిట్ అయ్యాయి. మిగిలిన 27 సినిమాలు యావరేజ్, సెమీ హిట్, ఫ్లాపులుగా మిగిలిపోయాయి.

Aishwarya Rai to Priyanka Chopra: కెరీర్‌లో హిట్లకంటే ఎక్కువ ఫ్లాపులు ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ వీరే..


కంగనా రనౌత్..

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ హిందీలో ఇప్పటి వరకూ దాదాపు 32 చిత్రాలలో నటించగా 5 మాత్రమే హిట్‌గా అయ్యియి. మిగిలిన 27 యావరేజ్, సెమీ హిట్‌, ఫ్లాపులుగా నిలిచాయి.

Aishwarya Rai to Priyanka Chopra: కెరీర్‌లో హిట్లకంటే ఎక్కువ ఫ్లాపులు ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ వీరే..


సోనమ్ కపూర్..

బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన నటి సోనమ్ కపూర్ (Sonam Kapoor). సోనమ్ హిందీలో ఇప్పటివరకు 19 సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అందులో 6 మాత్రమే హిట్ అవ్వగా.. మిగిలిన 13 సినిమాలు ఫాప్ అయ్యాయి.

Aishwarya Rai to Priyanka Chopra: కెరీర్‌లో హిట్లకంటే ఎక్కువ ఫ్లాపులు ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ వీరే..


కరీనా కపూర్ ఖాన్..

కపూర్ వారసురాలిగా రంగప్రవేశం చేసిన టాప్ హీరోయిన్‌గా ఎదిగిన నటి కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan). సైఫ్ అలీఖాన్‌తో పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించేసిన ఈ బ్యూటీ హిందీలో ఇప్పటివరకు 49 సినిమాలు చేసింది. అందులో కేవలం 13 సినిమాలు హిట్‌లు, బ్లాక్‌బస్టర్‌లు కాగా.. మిగిలిన 36 సినిమాలు యావరేజ్, సెమీ హిట్‌లు, ఫ్లాప్‌లుగా నిలిచాయి.

Aishwarya Rai to Priyanka Chopra: కెరీర్‌లో హిట్లకంటే ఎక్కువ ఫ్లాపులు ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ వీరే..


ప్రియాంక చోప్రా..

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra). అనంతరం హలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ సైతం తనదైన గుర్తింపు సాధించింది. ఈ బ్యూటీ బాలీవుడ్‌లో దాదాపు 41 సినిమాలు చేసింది. అందులో కేవలం 10 మాత్రమే హిట్, బ్లాక్‌బస్టర్లుగా నిలవగా.. మిగిలిన 31 సినిమాలు యావరేజ్, సెమీ హిట్, ఫ్లాప్‌లుగా మిగిలిపోయాయి.

Aishwarya Rai to Priyanka Chopra: కెరీర్‌లో హిట్లకంటే ఎక్కువ ఫ్లాపులు ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ వీరే..


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.