కొత్త సంవత్సరం వేళ Alia Bhatt, Ranbir Kapoor ఎక్కడా? విషయం బయటపెట్టిన డెన్మార్క్ రచయిత్రి!

ABN , First Publish Date - 2022-01-04T02:55:32+05:30 IST

బాలీవుడ్ రియల్ లైఫ్ కపుల్ రణబీర్, ఆలియా ‘బ్రహ్మాస్త్ర’ ప్రమోట్ చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. అయితే, అంతలోనే న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా ఇండియా నుంచీ ఈ ప్రేమ జంట మాయమైపోయింది. వాళ్లు ఎక్కడికి వెళుతున్నది సొషల్ మీడియాలో కూడా చెప్పలేదు. అయితే, సోమవారం విదేశం నుంచీ వచ్చి ముంబైలో విమానం దిగేశారు రణబీర్, ఆలియా...

కొత్త సంవత్సరం వేళ  Alia Bhatt, Ranbir Kapoor ఎక్కడా? విషయం బయటపెట్టిన డెన్మార్క్ రచయిత్రి!

బాలీవుడ్ రియల్ లైఫ్ కపుల్ రణబీర్, ఆలియా ‘బ్రహ్మాస్త్ర’ ప్రమోట్ చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. అయితే, అంతలోనే న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా ఇండియా నుంచీ ఈ ప్రేమ జంట మాయమైపోయింది. వాళ్లు ఎక్కడికి వెళుతున్నది సొషల్ మీడియాలో కూడా చెప్పలేదు. అయితే, సోమవారం విదేశం నుంచీ వచ్చి ముంబైలో విమానం దిగేశారు రణబీర్, ఆలియా.


ఇక త్వరలోనే పెళ్లంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో, బహుశా ప్రేమికులుగా ఆలియా, రణబీర్‌కి 2022 జనవరి ఒకటే చివరి న్యూ ఇయర్ డే అనవచ్చు. ‘బ్రహ్మాస్త్ర’ రిలీజ్ తరువాత ఆలియా భట్ కాస్తా ఆలియా కపూర్ అవుతుందని బీ-టౌన్ టాక్. ఆ సంగతి ఎలా ఉన్నా ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ కాబోయే భర్తతో సీక్రెట్ వెకేషన్ మాత్రం ఎంజాయ్ చేసి వచ్చేసింది. కాకపోతే, అనుకోకుండా ఓ డెన్మార్క్ రచయిత్రి వాళ్లిద్దరూ ఎక్కడికి వెళ్లింది తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా బయటపెట్టేసింది!


లీసా క్రిస్టోఫర్‌సెన్ డెన్మార్క్ దేశానికి చెందిన ప్రముఖ రచయిత్రి. అయితే, ఆమె వర్క్ మాత్రం ఆఫిక్రాలో కొనసాగుతూ ఉంటుంది. రైటర్‌గా ఫేమస్ అయిన లీసా ఫ్యాషన్ డిజైనర్, ఆర్ట్ క్యూరేటర్, ఫ్యాషన్ డిజైనర్, ఈవెంట్ ఆర్గనైజర్, లగ్జరీ సఫారీ క్యూరేటర్ కూడా! ఇన్ని రకాలుగా మల్టీ టాలెంటెడ్ అయిన ఆమె తాజాగా రణబీర్, ఆలియాతో కలసి తీసుకున్న ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేసింది. ‘‘సఫారీలో సమావేశం... బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, రణబీర్‌తో మాట్లాడుతుంటే టైం అద్భుతంగా గడిచిపోయింది’’ అంటూ తన ఆనందం వ్యక్తం చేసింది. ఆలియాకి లీసా తన బెస్ట్ సెల్లర్ బుక్ ‘బుష్ ఫ్రెండ్లీ’ని గిఫ్ట్‌గా ఇచ్చింది. 


ప్రస్తుతం కెన్యాలోని ఓ వైల్డ్ లైఫ్ సఫారిలో ఉన్న రైటర్ లీసా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆలియా, రణబీర్ ఫోటో షేర్ చేయటంతో ఫ్యాన్స్‌కి వారిద్దరి సీక్రెట్ డెస్టినేషన్ తెలిసిపోయింది. 2021 ముగిసి 2022 తరలి వస్తోన్న వేళ వారిద్దరూ ఆఫ్రికాలోని అడవి, అడవి జంతువుల అందాల నడుమ మైమరిచి కాలం గడిపారట!

Updated Date - 2022-01-04T02:55:32+05:30 IST