LinguSwamy: ‘ది వారియర్’ దర్శకుడు లింగుస్వామికి జైలు శిక్ష.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-23T18:16:48+05:30 IST

విశాల్ (Vishal) హీరోగా నటించిన ‘పందెంకోడి’, మాధవన్ (Madhavan) హీరోగా నటించిన ‘రన్’ చిత్రాలతో తమిళంతోపాటు తెలుగులోనూ..

LinguSwamy: ‘ది వారియర్’ దర్శకుడు లింగుస్వామికి జైలు శిక్ష.. కారణం ఏంటంటే..

విశాల్ (Vishal) హీరోగా నటించిన ‘పందెంకోడి’, మాధవన్ (Madhavan) హీరోగా నటించిన ‘రన్’ చిత్రాలతో తమిళంతోపాటు తెలుగులోనూ గుర్తింపుపొందిన దర్శకుడు లింగుస్వామి(Lingusamy). ఆ మూవీస్‌తో ఆయనకి మాస్ డైరెక్టర్‌గా గుర్తింపు రావడమే కాకుండా.. ఆ హీరోలకి మాస్ ఫాలోయింగ్‌ని తెచ్చిపెట్టింది. దాంతో ఎంతోమంది స్టార్ హీరోలు.. ముఖ్యంగా అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి తెలుగు హీరోలు కూడా ఆయనతో ఓ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ.. ఎందుకో ఏం మూవీ పట్టాలెక్కలేదు. తాజాగా ఈ డైరెక్టర్ టాలీవుడ్ యువనటుడు రామ్ పోతినేని హీరోగా ‘ది వారియర్ (The Warrior0’ అనే సినిమాకి దర్శకత్వం వహించి.. తెలుగు చిత్రసీమకి డెబ్యూ ఇచ్చారు. అయితే.. ఆ మూవీ ఫ్లాప్‌గా మిగిలింది. కాగా.. ఈ ఫేమస్ దర్శకుడికి తమిళనాడులోని సైదాపేట మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.


కొన్నేళ్లక్రితం లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ కలిసి తిరుపతి బ్రదర్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించారు. ఆ బ్యానర్ కింద ‘ఎన్ని యేజూ నాల్’ అనే సినిమాని తెరకెక్కించడం కోసం పీవీపీ క్యాపిట్ లిమిటెడ్ దగ్గర అప్పట్లోనే రూ.1.03 కోట్లని అప్పుగా తీసుకున్నారు. అయితే.. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. కానీ.. ఇప్పటి వరకూ వారు తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేదని ఆ కంపెనీ తాజాగా ఈ సోదరులపై కేసు ఫైల్ చేసింది. అంతేకాకుండా.. అప్పు చెల్లించేందుకు ఇచ్చిన చెక్ సైతం బౌన్స్ అయ్యిందని అందులో పేర్కొంది. దాంతో విచారించిన కోర్టు వారికి ఆరు నెలల జైలు శిక్షని ఖరారు చేసింది.


అయితే.. అనంతరం మద్రాసు హైకోర్టు సూచనమేరకు అప్పు మొత్తం తీర్చేందుకు లింగుస్వామి అంగీకారం తెలిపాడు. కానీ.. చెక్ బౌన్స్ కేసులో ఈ శిక్ష వేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు గురించి లింగుసామి ఒక ప్రకటన విడుదల చేశాడు. అందులో.. ఆ కేసు తమ నిర్మాణ సంస్థ, పివిపి క్యాపిటల్ లిమిటెడ్ మధ్య అని, ఈ తీర్పుపై వెంటనే అప్పీలు చేస్తామని చెప్పారు.

Updated Date - 2022-08-23T18:16:48+05:30 IST