Liger: ట్రెండింగ్‌లో రొమాంటిక్ సాంగ్ ఆఫట్

ABN , First Publish Date - 2022-08-06T17:17:43+05:30 IST

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా 'సాలా క్రాస్ బ్రీడ్' అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్

Liger: ట్రెండింగ్‌లో రొమాంటిక్ సాంగ్ ఆఫట్

'తేనె కళ్ళతోటి పిల్లగాడు పట్టేసిండే.. 

మందు పెట్టేసిండే.. 

మంట పుట్టించిండే.. ప్రేమ జెండా తెచ్చి గుండెల్లోన నాటేసిండే.. 

నాలో దూరేసిండే.. నన్ను మార్చేసిండే..'

అంటూ సాగే ఈ పాట లైగర్ (Liger) మూవీ నుంచి తాజాగా విడుదలై యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన ఈ సినిమా 'సాలా క్రాస్ బ్రీడ్' అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతోంది. పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey) హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీకి పరిచయమవుతోంది. ఇక ఈ చిత్రాన్ని ఇదే నెల 25న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యం సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. 


దీనిలో భాగంగా లైగర్ బృందం 'ఆఫట్' అనే సాంగ్‌ను వదిలారు. ఇందులో విజయ్ దేవరకొండం, అనన్య పాండే రొమాన్స్‌తో రెచ్చిపోయారు. పూరి మార్క్‌తో తెరకెక్కిన ఈ పాట విడుదలైన కిద్దిసేపట్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. ఇంతకముందు వచ్చిన రెండు పాటల కంటే కూడా ఈ తాజా పాట వేగంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ కూడా పెడుతున్నారు. లైగర్ మూవీతో విజయ్ దేవరకొండ ఈ ఏడాది భారీ హిట్ కొట్టబోతున్నట్టుగా చెబుతున్నారు. 


కరోనా కి ముందు వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో వచ్చిన విజయ్ ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత మొదలు పెట్టిన లైగర్ చాలా ఆలస్యం అయి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి విజయ్ - పూరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్‌తో కలిసి పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ, వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రల్లఒ కనిపించబోతున్నారు. 



Updated Date - 2022-08-06T17:17:43+05:30 IST