Liger: ఆ నాలుగు భాషల్లో 80 కోట్లకి థ్రియేటికల్ రైట్స్.. ఎవరు దక్కించుకున్నారంటే..

ABN , First Publish Date - 2022-07-28T16:35:59+05:30 IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యువ నటుడు విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘లైగర్’...

Liger: ఆ నాలుగు భాషల్లో 80 కోట్లకి థ్రియేటికల్ రైట్స్.. ఎవరు దక్కించుకున్నారంటే..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), యువ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘లైగర్ (Liger)’. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ (Ramya Krishna), మైక్ టైసన్ (Mike Tyson) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని ధర్మ పొడక్సన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్, పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ, ఛార్మీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 25న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల కానుంది.


చిత్ర నిర్మాతలు ఈ మూవీని ప్రకటించిన అప్పటి నుంచే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ పోస్టర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ని అందుకొని ఆ అంచనాలు భారీ స్థాయిలో పెంచేశాయి. అప్పటి నుంచి ఈ మూవీ గురించి ఎదో ఒకటి క్రేజీ న్యూస్ బయటికి వస్తూ నెట్టింట చర్చకు దారి తీస్తున్నాయి. ఈ మూవీ గురించి తాజాగా మరో క్రేజీ న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది.


‘లైగర్’ థియేట్రికల్ రైట్స్‌ని ఓ కంపెనీకి దాదాపు రూ.80 కోట్లకి అమ్మేసిందంట మూవీ టీం. అయితే.. అందులో ఓవర్సీస్, హిందీ రైట్స్ కాకుండా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇతర భాషల్లోనే పంపిణీకి మాత్రమే ఇంత ధరకి అమ్మేశారట. కాగా.. హిందీలో బాహుబలిని పంపిణీ చేసిన ఏఏ ఫిల్మ్స్ ఈ సినిమాని సైతం హిందీలో పంపిణీ చేసేందుకు పెద్ద మొత్తంలో ముట్టజెప్పిందంట. కాగా.. ఇప్పటికే ‘లైగర్’ శాటిలైట్, ఓటీటీ, ఆడియో రైట్స్ సైతం మంచి ధరకి అమ్ముడుపోయాయి. ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా దాదాపు రూ.99 కోట్లని సంపాదించిందంట చిత్రబృందం. విడుదలకి ముందే ఇన్ని రికార్డులు సృష్టిస్తున్న ఈ చిత్రం.. రిలీజ్ తర్వాత మరెన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Updated Date - 2022-07-28T16:35:59+05:30 IST