Liger : రన్ టైమ్ అంత తక్కువా?

ABN , First Publish Date - 2022-08-24T22:27:28+05:30 IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) తొలి కలయికలో తెరకెక్కిన యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’ (Liger). ‘సాలా క్రాస్‌బ్రీడ్’ ట్యాగ్ లైన్. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం రేపే (ఆగస్ట్ 25) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది.

Liger : రన్ టైమ్ అంత తక్కువా?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) తొలి కలయికలో తెరకెక్కిన యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’ (Liger). ‘సాలా క్రాస్‌బ్రీడ్’ ట్యాగ్ లైన్. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం రేపే (ఆగస్ట్ 25) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. విజయ్ బాక్సర్ గా నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే (Ananya Panday) కథానాయికగా నటిస్తుండగా, రమ్యకృష్ణ (Ramya Krishna) కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ (Mike Tyson) మరో ముఖ్యపాత్రను చేస్తున్నారు. 


‘లైగర్’ చిత్రం ప్రమోషన్స్‌ను కోసం పూరీ అండ్ టీమ్ ఓ రేంజ్‌లో కష్టపడ్డారు. విజయ్ దేవరకొండ అయితే నార్త్‌లో వరుస ఇంటర్వ్యూలు నిర్వహించి సినిమాపై అంచనాల్ని పెంచేశాడు. ‘లైగర్’ సక్సెస్‌పై విజయ్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ‘లైగర్’ సినిమా ఫస్ట్ కాపీ చూసిన పూరీ అండ్ టీమ్ చాలా హ్యాపీ ఫీలయ్యారట. తాము పడిన కష్టానికి మంచి ఔట్ పుట్ దక్కిందని హీరో విజయ్, దర్శకుడు పూరీ సంతృప్తి వ్యక్తం చేశారట. ఇక ఈ సినిమా ఈ సినిమా రన్ టైమ్‌ను చాలా తక్కువగా సెట్ చేశారని సమాచారం. మొత్తం 140 నిమిషాల రన్ టైమ్ ఫిక్స్ చేశారట. అంటే దాదాపు రెండు గంటల 20 నిమిషాలన్నమాట. 


ఫస్టాఫ్ 1గంట 15 కాగా, సెకండాఫ్ 1గంట 05 నిమిషాలుగా ఈ సినిమా ప్రదర్శనా సమయం సెట్ అయింది. తెలంగాణలో ఈ రోజు (ఆగస్ట్ 24) అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రదర్శనలు (Special Shows) ఉంటాయని చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఈ సినిమా హిందీ వెర్షన్ మాత్రం ఆగస్ట్ 26న విడుదల కాబోతోంది. ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి పాజిటివ్ బజ్ నడుస్తోంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. 

Updated Date - 2022-08-24T22:27:28+05:30 IST