Liger: ట్విట్టర్‌లో లైవ్‌లోకి రానున్న మూవీ టీం..

ABN , First Publish Date - 2022-08-08T18:06:02+05:30 IST

దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీస్‌లో ‘లైగర్ (Liger)’ మూవీ తప్పకుండా ఉంటుంది...

Liger: ట్విట్టర్‌లో లైవ్‌లోకి రానున్న మూవీ టీం..

దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీస్‌లో ‘లైగర్ (Liger)’ మూవీ తప్పకుండా ఉంటుంది. పూరీ జగన్నాథ్ (puri jagannadh), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అనన్య పాండే (Ananya Panday) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ తరుణంలో మూవీ టీం దేశంలోని ప్రధాన నగరాలకు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.


అంతటితోనే ఆగకుండా ఈ మూవీ ఆన్‌లైన్‌లోనూ ప్రమోషనల్ కార్యక్రమాలను జోరుగా చేస్తోంది. అందులో భాగంగా ట్విట్టర్ మూవీస్ ద్వారా ఓ సెషన్‌ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వీడియోని విజయ్, అనన్య వారి అఫిషియల్ ఖాతాల్లో షేర్ చేశారు. అందులో.. ‘మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి మేం త్వరలో ట్విట్టర్ మూవీస్‌లోకి రానున్నాం. AskLiger యాష్‌ట్యాగ్‌తో ప్రశ్నలను అడగండి’ అంటూ విజయ్ క్యాప్షన్ రాసుకొచ్చాడు.


అలాగే.. అనన్య సైతం.. ‘నేను, విజయ్ దేవరకొండ మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడానికి.. ట్విట్టర్ మూవీస్‌లోకి రానున్నాం. ఇంకెందుకు ఆలస్యం అడగండి. #AskLiger #Liger’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ మూవీని కరణ్‌జోహార్ (Karan Johar), పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. కాగా.. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల కానుంది.





Updated Date - 2022-08-08T18:06:02+05:30 IST