Vijay Deverakonda: మైక్ టైసన్‌కు భారీ పారితోషికం ఇచ్చిన ‘లైగర్’ మేకర్స్

ABN , First Publish Date - 2022-08-31T20:24:56+05:30 IST

సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి విజయ్ దేవర‌కొండ (Vijay Deverakonda). సోలో హీరోగా నటించిన మొదటి సినిమా ‘పెళ్లి చూపులు’ తోనే ప్రేక్షకులను

Vijay Deverakonda: మైక్ టైసన్‌కు భారీ పారితోషికం ఇచ్చిన ‘లైగర్’ మేకర్స్

సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి విజయ్ దేవర‌కొండ (Vijay Deverakonda). సోలో హీరోగా నటించిన మొదటి సినిమా ‘పెళ్లి చూపులు’ తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అనంతరం అనేక చిత్రాలు చేసి యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తాజాగా అతడు నటించిన సినిమా ‘లైగర్’ (Liger). అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. మైక్ టైసన్, రమ్య కృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హల్‌చల్ చేస్తుంది. ఈ సినిమా కోసం మైక్ టైసన్‌ (Mike Tyson)కు భారీగా రెమ్యూనరేషన్ చెల్లించారని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. 


‘లైగర్’ స్క్రిఫ్ట్ రాసుకున్నప్పుడు ఓ రోల్ కోసం రిఫరెన్స్‌గా మైక్ టైసన్‌ను అనుకున్నారు. మూవీ షూటింగ్ ప్రారంభించాక ఆ పాత్రను మైక్‌తోనే చేయించాలనుకున్నారు. ఓ ఏడాది పాటు సంప్రదింపులు జరిపిన తర్వాత ఆ పాత్రకు అతడు ఒప్పుకొన్నాడు. ఈ బాక్సింగ్ ఛాంపియన్‌ను ఒప్పించడానికి  భారీగా రెమ్యూనరేషన్ చెల్లించారట. దాదాపుగా రూ.20కోట్ల నుంచి రూ.25కోట్ల వరకు పారితోషికాన్ని ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘లైగర్’ ను పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. పాన్ ఇండియాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 25న విడుదలయింది. ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. డిస్ట్రిబ్యూటర్స్‌కు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ మైక్ టైసన్ లాంటి లెజెండ్‌కు ఇలాంటి జోకర్ పాత్ర ఇచ్చారేంటని కామెంట్స్ చేశారు. మైక్ ఈ పాత్రను ఏలా అంగీకరించాడో అని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.

Updated Date - 2022-08-31T20:24:56+05:30 IST