Liger: ఏపీలో భారీ థియేట్రికల్ బిజినెస్..?

ABN , First Publish Date - 2022-08-10T15:56:51+05:30 IST

పూరి జగన్నాథ్ (Puri Jagannath) సినిమా అంటే మాస్ ఆడియన్స్‌లో ఉండే క్రేజ్ ఏ రేంజ్‌లోనో అందరికీ తెలిసిందే. కింద పడ్డ కూడా నాదే పైచేయి అనుకునే పూరి నైజానికి తగ్గట్టే తన సినిమాలో హీరోల బాడీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది.

Liger: ఏపీలో భారీ థియేట్రికల్ బిజినెస్..?

పూరి జగన్నాథ్ (Puri Jagannath) సినిమా అంటే మాస్ ఆడియన్స్‌లో ఉండే క్రేజ్ ఏ రేంజ్‌లోనో అందరికీ తెలిసిందే. కింద పడ్డ కూడా నాదే పైచేయి అనుకునే పూరి నైజానికి తగ్గట్టే తన సినిమాలో హీరోల బాడీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఎలాంటి క్లాస్ హీరో అయినా పూరి దర్శకత్వంలో ఒక్క సినిమా చేస్తే చాలు కావాల్సిన మాస్ ఇమేజ్ వచ్చేస్తుంది. పూరితో సినిమా చేసిన హీరో ఇమేజ్ మారిపోవాల్సిందే. ఎన్ని ఫ్లాపులొచ్చినా పూరికి ఉండే క్రేజ్ తగ్గదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ మాస్ హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా లైగర్ (Liger) సినిమాను తెరకెక్కించారు.


ఈ సినిమాను ఆగస్ట్ 25న భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey) హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అవుతోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ, మకరంద్ దేశ్ పాండే, ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జొహార్‌తో కలిసి పూరి, చార్మి నిర్మిస్తున్నారు. 


ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో లైగర్ టీమ్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే, ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ భారీగా అంచనాలను పెంచాయి. దాంతో ఇప్పుడు బిజినెస్ పరంగా లైగర్ కి సాలీడ్ ఆఫర్స్ వస్తున్నాయట. ఏపీలో థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుందని సమాచారం. కేవలం వైజాగ్, సీడెడ్ లోనే ఈ సినిమాకి 30 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక ఓవరాల్‌గా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అనుకున్నదానికంటే రెట్టింపు స్థాయిలో బిజినెస్ అయిందని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి లైగర్ పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో.

Updated Date - 2022-08-10T15:56:51+05:30 IST