Ananya Panday: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న ‘లైగర్’ భామ..!

Twitter IconWatsapp IconFacebook Icon
Ananya Panday: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న లైగర్ భామ..!

చిన్న తనంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ అనన్య పాండే (Ananya Panday). ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ -2’ తో వెండితెర పైకి రంగ్ర‌ ప్రవేశం చేసింది. ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్, అనన్యను లాంచ్ చేశాడు. ఈ ప్రొడక్షన్ హౌస్‌తోనే ఆమె ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ‘కాల్ మి బే’ (Call Me Bae) షోలో అనన్య నటించనుంది. ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.   


అనన్య పాండే ఈ వెబ్‌సిరీస్‌లో బిలియనీర్ ఫ్యాషన్ డిజైనర్‌గా నటించనుంది. ధనవంతుల కుటుంబం నుంచి వచ్చి స్కామ్‌లో చిక్కుకున్న యువతిగా ఆమె కనిపించనుంది. ఈ షోలో మరికొంత మంది బాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో నటించనున్నారని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ వెబ్‌సిరీస్‌ స్క్రిఫ్ట్‌ను ఇషితా మొయిత్రా, సమీనా మోట్లేకర్, రోహిత్ నాయర్ తదితరులు రాశారు. కొలిన్ డి కున్హా (Collin D’Cunha) దర్శకత్వం వహించనున్నాడు.  ‘దోస్తానా-2’ ను కొలిన్ డైరెక్ట్ చేయాలి. కానీ, ఆ ప్రాజెక్టు ఆగిపోవడంతో ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నాడట. ఇక అనన్య పాండే కెరీర్ విషయానికి వస్తే.. ‘డ్రీమ్ గర్ల్-2’ (Dream Girl 2) లో ఆమె నటించనుంది. ఆయుష్మాన్ ఖురానాకు జోడీగా కనిపించనుంది. ఈ సినిమా పూర్తి కాగానే ‘కాల్ మి బే’ ను పట్టాలెక్కించనుందని సమాచారం. ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ ఈ ఏడాది చివరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది రెండో అర్ధ భాగంలో ప్రైమ్ మీడియోలో షో స్ట్రీమింగ్ కానుందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. అనన్య పాండే తాజాగా ‘లైగర్’ (Liger) లో నటించింది. విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా కనిపించింది. పాన్ ఇండియాగా రూపొందిన ఈ ప్రాజెక్టుపై అనన్య భారీ ఆశలు పెట్టుకుంది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం కావడంతో ఆమె ఆశలన్ని అడియాశలయ్యాయి.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.