Liger: ‘లైగర్’ కు భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్న విజయ్ దేవరకొండ

ABN , First Publish Date - 2022-08-26T22:49:13+05:30 IST

సినీ ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి విజయ్ దేవర‌కొండ (Vijay Deverakonda). తెలంగాణ యాసతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి చిత్రాలతో

Liger: ‘లైగర్’ కు భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్న విజయ్ దేవరకొండ

సినీ ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి విజయ్ దేవర‌కొండ (Vijay Deverakonda). తెలంగాణ యాసతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా అతడు నటించిన సినిమా ‘లైగర్’ (Liger). అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. మైక్ టైసన్, రమ్య కృష్ణ, విషు రెడ్డి, రోనిత్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న విడుదల అయింది. తొలిరోజే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ‘లైగర్’ విడుదల కావడంతోనే సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో విపరీతంగా హల్‌చల్ చేస్తుంది. 


‘లైగర్’ కు విజయ్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. దాదాపుగా రూ. 35కోట్లను పారితోషికంగా అందుకున్నాడని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అనన్య పాండే రూ.3కోట్లు, రోనిత్ రాయ్ రూ. 1.5కోట్లు, రమ్య కృష్ణ రూ.కోటిని రెమ్యూనరేషన్‌గా తీసుకున్నారని వదంతులు హల్‌‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందింది. కరీంనగర్ యువకుడు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌గా ఏ విధంగా మారాడనేది ఈ చిత్ర కథనం. ‘లైగర్’ ను ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హక్కులు అన్ని ఏరియాలకు కలిపి రూ. 90కోట్లకు అమ్ముడయ్యాయి. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధించింది. దాదాపుగా రూ. 9కోట్లకు పైగా షేర్‌ను కలెక్ట్ చేసింది. తొలిరోజే నెగెటివ్ టాక్‌ రావడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపించడం లేదు.

Updated Date - 2022-08-26T22:49:13+05:30 IST