Khushi : ‘లైగర్’ ఎఫెక్ట్ అంత పడిందా?

ABN , First Publish Date - 2022-09-02T16:01:03+05:30 IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) కాంబినేషన్‌లో చిత్రమనగానే ‘లైగర్’ (Liger) పై ఎక్కడలేని క్రేజ్ వచ్చి పడింది. దానికి తగ్గట్టుగానే సినిమా ప్రమోషన్స్‌ను రాజీలేకుండా నిర్వహించారు.

Khushi : ‘లైగర్’ ఎఫెక్ట్ అంత పడిందా?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) కాంబినేషన్‌లో చిత్రమనగానే ‘లైగర్’ (Liger) పై ఎక్కడలేని క్రేజ్ వచ్చి పడింది. దానికి తగ్గట్టుగానే సినిమా ప్రమోషన్స్‌ను రాజీలేకుండా నిర్వహించారు. విజయ్ సైతం ‘లైగర్’ చిత్రం కోసం నార్త్ అంతటా రౌండ్స్ కొట్టాడు. టీజర్, సింగిల్స్, ట్రైలర్ తో భారీ అంచనాల్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది చిత్ర బృందం. కట్ చేస్తే ‘లైగర్’ చిత్రానికి దారుణమైన రిజల్ట్ వచ్చింది. ఇంతకు ముందు పూరీ తీసిన చిత్రాలే బెటర్ అనే లెవెల్లో ఔట్ పుట్ ఇచ్చాడు పూరీ. ఒక వేళ ఆ సినిమా కానీ సూపర్ హిట్ అయి ఉంటే.. ప్రీ రిలీజ్ టైమ్ లో విజయ్ అన్నట్టు ‘లైగర్’ అన్ని ఇండస్ట్రీస్ లోనూ హాట్ టాపిక్ అయి ఉండేది. అయితే ఇప్పుడు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 60కోట్ల మేర నష్టాల్ని తెచ్చిపెట్టిందని. ఇప్పటికే చాలా చోట్ల లైగర్ స్ర్కీన్స్ తగ్గుముఖం పడుతున్నాయి.


‘లైగర్’ చిత్రానికి కేటాయించిన బీసీ థియేటర్స్ ను కొత్త గా విడుదలయ్యే చిత్రాలకు, అద్భుతంగా రన్ అవుతోన్న ‘బింబిసార (Bimbisara), కార్తికేయ 2 (Karthikeya 2)’ చిత్రాలకు ఇచ్చేస్తున్నారని టాక్. ఇప్పుడు ‘లైగర్’ ఎఫెక్ట్ .. డైరెక్ట్ గా విజయ్ తదుపరి చిత్రమైన ‘ఖుషి’ (Khushi) పై పడుతోంది. విజయ్, సమంత (Samantha) తొలి కలయికలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు సగంపైనే పూర్తయింది. చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయాలనుకుంటున్నారు కానీ.. మారిన పరిస్థితుల దృష్ట్యా విడుదలను వాయిదా వేయక తప్పడం లేదు. ఒక వేళ అఖిల్ ‘ఏజెంట్’ (Agent) కనుక ఆ నెల మూడో వారంలో రాకపోతే..  ‘ఖుషి’ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే లైగర్ తాలూక ప్రభావం దీనిపై ఖచ్చితంగా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. 


దర్శకుడు శివ నిర్వాణ (Shiva Niravana) గత చిత్రం.. నానీ (Nani) హీరోగా ఓటీటీలో వచ్చిన ‘టక్ జగదీష్’ (Tuck Jagdeesh) డిజాస్టర్ అవడం.. ఖుషి పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవాలి. అంతేకాదు పవర్ స్టార్ క్లాసిక్ టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టడం మరో ఎఫెక్ట్. ఒకవేళ ‘ఖుషి’ కానీ అటో ఇటో అయితే.. పవన్ అభిమానుల నుంచి ట్రోలింగ్స్ తప్పవు. గతంలో నానీ ‘గ్యాంగ్ లీడర్‌’ (Gang Leader) కు అదే అనుభవం ఎదురయింది. మరి ఇన్ని రకాల ప్రతికూలతలతో ‘ఖుషి’ చిత్రం ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. 

Updated Date - 2022-09-02T16:01:03+05:30 IST