Liger: మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న 'కోకా 2.0'..

ABN , First Publish Date - 2022-08-13T17:02:37+05:30 IST

తాజాగా లైగర్ (Liger) సినిమా నుంచి మరో సింగిల్ వచ్చి యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), అనన్య పాండే (Ananya Pandey) జంటగా

Liger: మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న 'కోకా 2.0'..

తాజాగా లైగర్ (Liger) సినిమా నుంచి మరో సింగిల్ వచ్చి యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), అనన్య పాండే (Ananya Pandey) జంటగా నటించిన సినిమా ఇది. పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకుడు. ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటిటికే, 'ఆఫట్' అంటూ సాగే మసాలా సాంగ్ వచ్చి బాగా ఆకట్టుకుంది. ఇంకా ఆ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.


ఈ క్రమంలో తాజాగా 'కోకా 2.0' అంటూ సాగే సాంగ్‌ను వదిలారు. దలేర్ మెహందీలా, హనీ సింగ్ పాటల్లా కాస్త పాప్ మిక్స్ చేసి కంపోజ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ ముందెన్నడూ కనిపించనంత కొత్త అవతారంలో కనిపించి ఆకట్టుకున్నాడు. తలపాగా పంజాబీ ట్రెడిషన్ డ్రెస్ లతో కొత్త మేకోవర్ ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి విడుదల తేదీ దగ్గరపడుతున్న కోద్దీ లైగర్ మూవీపై అంచనాలు బాగానే పెంచేస్తున్నారు.


ఇటు పూరి జగన్నాథ్‌కి అటు విజయ్ దేవరకొండకి లైగర్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడం విశేష. మరి పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. కాగా, ఈ మూవీని పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించారు. సీనియర్ నటి రమ్యకృష్ణ, మైక్ టైసన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 



Updated Date - 2022-08-13T17:02:37+05:30 IST