Liger Effect: ముంబై నుంచి షిప్ట్ అయిపోతున్న పూరీ జగన్నాథ్.. నెలకు రూ.10 లక్షలు అద్దె కట్టాల్సి రావడంతో..!?

ABN , First Publish Date - 2022-09-08T19:30:08+05:30 IST

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం ‘లైగర్ (Liger)’...

Liger Effect: ముంబై నుంచి షిప్ట్ అయిపోతున్న పూరీ జగన్నాథ్.. నెలకు రూ.10 లక్షలు అద్దె కట్టాల్సి రావడంతో..!?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం ‘లైగర్ (Liger)’. విజయ్ దేవరకొండ, అనన్యపాండే జంటగా నటించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్‌తో కలిసి ఆయనే స్వయంగా నిర్మించాడు. అంతేకాకుండా ఈ మూవీ కోసం పూరీ తన మాకాంని ఏకంగా ముంబైకే మార్చాడు. దానికోసం అక్కడ నెలకి పది లక్షలు పెట్టి ఓ లగ్జరీయస్ మ్యాన్షన్‌ని అద్దెకి తీసుకున్నాడు.


దాదాపు మూడేళ్లుగా కష్టపడి ఈ చిత్రబృందం ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది. అనంతరం విడుదలకి ముందు విడుదల చేసిన ట్రైలర్, పోస్టర్‌ మంచి రెస్సాన్స్ అందుకుని ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. మూవీ టీం ప్రమోషన్స్ చేస్తున్న సమయంలో కూడా మంచి రెస్సాన్స్ వచ్చింది. అయితే.. అన్ని అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ వాటిని అందుకోలేక చతికిలాపడింది. దాంతో ఈ మూవీ నిర్మాణంలో భాగమైన పూరీకి భారీగా నష్టాలు వచ్చాయి. దీంతో ఆ భవనానికి రూ.10 లక్షల అద్దె కట్టడం కష్టమని భావించి.. ముంబైలోని ఆ భవనాన్ని ఖాళీ చేసి హైదరాబాద్‌కి షిప్ట్ అవుతున్నట్లు సమాచారం. దీని గురించి నెట్టింట ప్రచారం జరగడంతో పూరీకి ఎంతటి కష్టమొచ్చిందని ఆయన అభిమానులు బాధపడుతున్నారు.


కాగా.. లైగర్‌ విడుదలకి ముందే విజయ్ దేవరకొండతోనే ‘జనగణమన’ అనే సినిమాని తీయాలని ప్లాన్ చేశాడు పూరీ. పాన్ ఇండియా స్థాయిలో తీయాలనుకున్న ఆ సినిమాకి పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కానీ.. లైగర్ ఫ్లాప్‌గా నిలవడంతో ఆ సినిమా ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. దానిమీద ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

Updated Date - 2022-09-08T19:30:08+05:30 IST