Liger : ఆడియో రైట్స్ ఆ సంస్థకేనా?

ABN , First Publish Date - 2022-05-03T19:11:51+05:30 IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో రాబోతున్న తొలి చిత్రం ‘లైగర్’. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లోని యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ బాక్సర్‌గా నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించబోతున్నాడు. ఈ పాత్రకోసం అతడు జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ బాడీని కూడా బిల్డ్ చేశాడు.

Liger : ఆడియో రైట్స్ ఆ సంస్థకేనా?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో రాబోతున్న తొలి చిత్రం ‘లైగర్’. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లోని యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ బాక్సర్‌గా నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించబోతున్నాడు.  ఈ పాత్రకోసం అతడు జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ బాడీని కూడా బిల్డ్ చేశాడు. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది. చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 25న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఇంతకు ముందు విడుదలైన ‘లైగర్’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలక పాత్ర చేయనుండడం విశేషం. విజయ్‌ దేవరకొండకు తండ్రి పాత్రలో ఆయన కనిపించనున్నట్టు టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. 


తాజా సమాచారం ప్రకారం లైగర్ ఆడియో రైట్స్ ను ప్రముఖ ఆడియో సంస్థ సోనీ మ్యూజిక్ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు వినికిడి. దీనికోసం ఆ సంస్థ ఏకంగా రూ. 14 కోట్లు చెల్లించి అన్నిభాషల్లోని రైట్స్ సొంతం చేసుకున్నారట. విజయ్ కెరీర్‌లో ఇది అది పెద్దం మొత్తం అని చెప్పాలి. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను మణిశర్మ అందిస్తుండగా.. పాటలకు తనిష్క్ బాగ్చీ స్వరాలు కూర్చనున్నాడు. 

Updated Date - 2022-05-03T19:11:51+05:30 IST