Liger: మరో సాంగ్ వచ్చేస్తోంది..

ABN , First Publish Date - 2022-08-04T18:30:39+05:30 IST

హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ (Liger). ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ చేయనున్నారు.

Liger: మరో సాంగ్ వచ్చేస్తోంది..

హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ  ‘లైగర్’ (Liger). ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ చేయనున్నారు.  స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో  బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే (Ananya Panday) కథానాయికగా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ బాక్సర్‌గా అదరగొట్టబోతున్నాడు. 


ఇదివరకు విడుదలైన ఈ సినిమా టీజర్, సింగిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు కూడా భారీ ఎత్తున స్పందన లభించింది. ఈ నేపథ్యంలో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ క్రమంలో నిర్వహిస్తున్న ప్రమోషన్స్‌లో భాగంగా లైగర్ మూవీ నుంచి 'ఆఫట్' అనే పల్లవితో సాగే సాంగ్ ప్రోమోని ఈరోజు (ఆగష్టు 4) సాయంత్రం 4 గంటలకు వదలబోతున్నారు. అలాగే, ఫుల్ సాంగ్ ని ఆగష్టు 5 ఉదయం 9 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. 


ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై భారీ స్థాయిలో కరణ్ జొహార్, పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఇందులో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఇంతకముందు వచ్చిన రెండు పాటలు మాస్ ఆడియన్స్‌ని బాగా అకట్టుకొని యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. మరి ఇప్పుడు రాబోతున్న మూడవ సాంగ్ 'ఆఫట్' ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 

Updated Date - 2022-08-04T18:30:39+05:30 IST