ఇద్దరమ్మాయిల మధ్య ప్రేమ.. యూట్యూబ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన వీడియో.. నెటిజన్ల రియాక్షన్స్ ఏంటంటే..

ABN , First Publish Date - 2021-11-24T22:46:11+05:30 IST

యూట్యూబ్‌లో ఒక వీడియో వైరల్‌గా మరింది. నెటిజన్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. తమిళ సినిమా కొత్త పుంతలు తొక్కుతుందని

ఇద్దరమ్మాయిల మధ్య ప్రేమ.. యూట్యూబ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన వీడియో.. నెటిజన్ల రియాక్షన్స్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఒక వీడియో వైరల్‌గా మరింది. నెటిజన్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. తమిళ సినిమా కొత్త పుంతలు తొక్కుతుందని కొందరంటుంటే, మరికొందరు మాత్రం తమిళ సాంస్కృతిని పాడు చేస్తున్నారు అంటూ మేకర్స్ మీద విరుచుకు పడుతున్నారు. వివాదానికి కారణమైన ఆ వీడియోలో ఏముంది.. నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోవటానికి కారణం ఏంటీ తెలియాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే..


యూట్యూబ్‌లోని సరేగమ తమిళ్ ఛానల్‌లో మాగిజిని పేరుతో ఒక మ్యూజిక్ వీడియో విడుదయింది. ఇద్దరమ్మాయిల మధ్య ప్రేమను ఈ వీడియోలో చూపించారు. తమిల్ 96లో నటించి ఫేమ్ తెచ్చుకున్న గౌరీ కిషన్, అనఘా ఈ వీడియోలో కనిపించారు. అనఘూ ఒక విద్యార్థిని. చదువు నిమిత్తం చెన్నైకి వస్తుంది. గౌరీ తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటుంది. భరత నాట్యం నేర్చుకునేందుకు ఇద్దరూ ఒకే దగ్గరికి వస్తారు. ఒకరికి మరొకరు పరిచయమవుతారు. అనంతరం డేటింగ్ చేయడం మొదలుపెడతారు. రాత్రిళ్లు కూడా ఒకే గదిలో ఉంటారు. గౌరీ తండ్రి ఆమెను లెస్బియన్‌గా గుర్తిస్తాడు. ఇంటి నుంచి తరిమేస్తాడు. అనఘా కూడా ఇంటి నుంచి బయటకు వస్తుంది. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు తన తల్లికి చెబుతోంది. అనంతరం ఇద్దరూ కలిసి జీవించడం మొదలుపెడతారు. అది మా తప్పు కాదు అని టైటిల్ కార్డ్స్‌ పడటంతో వీడియో ముగుస్తుంది.  


విజి. బాల సుబ్రమణ్యన్ ఈ సాంగ్‌ను రాసి, డైరెక్ట్ చేశారు. మదన్ కార్కి లిరిక్స్  రాశారు. సరేగమ తమిళ్ ఛానల్‌లో ఈ వీడియో విడుదలయింది. ఎల్‌జీ‌బీటీ(లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్స్)పై అవగాహన కల్పించడానికే ఈ వీడియోను రూపొందించామని మేకర్స్ చెబుతున్నారు.   


యూట్యూబ్‌లో ఈ వీడియో విడుదలయిన అనంతరం నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. తమిళ చిత్ర పరిశ్రమ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.  అమెరికన్ 2.0 స్టూపిడిటీ అని మరో నెటిజన్ విమర్శించాడు. తమిళ చిత్ర పరిశ్రమ ఎటువంటి కథాంశం మీదనైనా సినిమా తీయగలదు అని సోషల్ మీడియా యూజర్ తన స్పందనను తెలిపాడు. 



Updated Date - 2021-11-24T22:46:11+05:30 IST