Leonardo DiCaprio: శృంగారంలో అలా చేయడం అలవాటంటూ..

ABN , First Publish Date - 2022-09-16T18:09:39+05:30 IST

హాలీవుడ్‌ (Hollywood)లోని టాప్ స్టార్స్‌లో లియోనార్డో డికాప్రియో (Leonardo DiCaprio) ఒకరు. గ్రాఫిక్స్‌తో వండర్స్ క్రియేట్ చేసే దర్శకుడు..

Leonardo DiCaprio: శృంగారంలో అలా చేయడం అలవాటంటూ..

హాలీవుడ్‌ (Hollywood)లోని టాప్ స్టార్స్‌లో లియోనార్డో డికాప్రియో (Leonardo DiCaprio) ఒకరు. గ్రాఫిక్స్‌తో వండర్స్ క్రియేట్ చేసే దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ‘టైటానిక్’ సినిమాతో ఈ నటుడికి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. ఇప్పటికే ఆయన్ని చాలామంది టైటానిక్ హీరో అంటేనే గుర్తుపడతారు. ఆ తర్వాత కూడా ఎన్నో మంచి చిత్రాల్లో నటించి.. పలుమార్లు ఆస్కార్ బరిలో నిలిచాడు. అయితే.. ఈ నటుడు సినిమాలతో ఎంత ఫేమస్సో.. డేటింగ్ లైఫ్‌తోనూ అంతే ఫేమస్. 47 ఏళ్ల సంవత్సరాల ఈ యాక్టర్ ఇప్పటి వరకూ 25 ఏళ్ల వయస్సు దాటిన అమ్మాయిలతో డేటింగ్ చేయకపోవడం ఇక్కడ విశేషం.


డికాప్రియో ఇప్పటికే చాలామంది అందాల భామలతో డేటింగ్ చేశాడు. అయితే.. 50 ఏళ్లు దగ్గర పడుతున్న ఈ తరుణంలో ఈ నటుడు తాజాగా  కామిలా మొర్రోన్‌ అనే నటికి బ్రేకప్ చెప్పాడు. అది కూడా ఆమె తన 25వ పుట్టినరోజు జరుపుకున్న తరుణంలోనే కావడం విశేషం. దీంతో ఈ నటుడిపై సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. 25 ఏళ్లు దాటిన అమ్మాయిలు ఈ నటుడిగా నచ్చరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో.. ఈయన శృంగార జీవితం గురించి ప్రముఖ ఇంగ్లిష్ మెగజైన్ ఒకటి గతంలో రాసిన ఓ ఆర్టికల్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.


డికాప్రియో మాజీ ప్రియురాలి సన్నిహితులు ఒకరు ఆయన శృంగార జీవితం గురించి చెప్పిన విషయాలను ఆ మేగజైన్ రాసుకొచ్చింది. 2016లో వచ్చిన ఆ కథనంలో.. శృంగారం చేసేటప్పుడు లియోనార్డో డికాప్రియో హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వినడానికి ఇష్టపడతాడట. కొన్నిసార్లు అలా డికాప్రియోని చూసి.. అతని చర్యలు కొంచెం మొరటుగా, నిర్లక్ష్యంగా అనిపించడంతో.. ఆయన ప్రియురాలు ఆయనకి బ్రేకప్ చెప్పిందట. అంతేకాకుండా.. శృంగారం మధ్యలో ఉన్నప్పుడు డికాప్రియె రిలాక్స్ అయ్యి.. భాగస్వాములను కొనసాగించమని చెబుతాడట. అందుకే చాలామంది ఇబ్బందిగా ఫీల్ అయ్యి అతనికి బ్రేకప్ చేప్పేశారని చాలాసార్లు ప్రచారం జరిగింది. కాగా.. డికాప్రియో ప్రస్తుతం సింగర్ గిగి హాడిడ్‌తో డేటింగ్‌లో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఆమె వయస్సు 27 ఏళ్లు కావడంతో దానిపై కూడా విపరీతమైన చర్చ జరుగుతోంది.

Updated Date - 2022-09-16T18:09:39+05:30 IST