‘అది’ తప్పేనంటోన్న ప్రేక్షకులు... ‘కావాలనే’ చేశామంటోన్న డైరెక్టర్!

ABN , First Publish Date - 2021-12-31T04:15:38+05:30 IST

హాలీవుడ్ సూపర్ స్టార్స్ లియోనార్డో డికాప్రియో, జెన్నీఫర్ లారెన్స్ నటించిన తాజా చిత్రం ‘డోంట్ లుక్ అప్’. ఈ మధ్యే విడుదలైన బిగ్ బడ్జెట్ మూవీ మంచి రివ్యూస్ సంపాదించింది. సూపర్ కలెక్షన్స్ కూడా. అయితే, సినిమాలోని ఓ సీన్‌లో క్రూ మెంబర్స్ తెర మీద కనిపించటం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. అదే విషయాన్ని పలువురు ఎత్తి చూపుతూ చర్చిస్తున్నారు.

‘అది’ తప్పేనంటోన్న ప్రేక్షకులు... ‘కావాలనే’ చేశామంటోన్న డైరెక్టర్!

హాలీవుడ్ సూపర్ స్టార్స్ లియోనార్డో డికాప్రియో, జెన్నీఫర్ లారెన్స్ నటించిన తాజా చిత్రం ‘డోంట్ లుక్ అప్’. ఈ మధ్యే విడుదలైన బిగ్ బడ్జెట్ మూవీ మంచి రివ్యూస్ సంపాదించింది. సూపర్ కలెక్షన్స్ కూడా. అయితే, సినిమాలోని ఓ సీన్‌లో క్రూ మెంబర్స్ తెర మీద కనిపించటం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. అదే విషయాన్ని పలువురు ఎత్తి చూపుతూ చర్చిస్తున్నారు.

‘డోంట్ లుక్ అప్’ సినిమాలో ‘ఎడిటింగ్ మిస్టేక్’ జరిగింది... క్రూ మెంబర్స్ ఫైనల్ వర్షన్‌లో కనిపించేశారు... ఈ టాక్ ఎక్కువైపోతుండటంతో దర్శకుడు యాడమ్ మెక్‌కే క్లారిటీ ఇచ్చాడు. ‘‘సినిమా కోసం పని చేసిన క్రూ మెంబర్స్‌ని మేం కావాలనే ఓ సీన్‌లో చూపించాం. ఎంతో విభిన్నంగా సినిమాని రూపొందించిన వారందర్నీ తెరపై చూపించి గౌరవించాలనేదే మా ఉద్దేశం’’ అంటున్నాడు డైరెక్టర్. ‘డోంట్ లుక్ అప్’ సినిమా ఇద్దరు వ్యోమగాముల కథ. భూమి వైపుకి దూసుకొస్తోన్న ఓ తోక చుక్క గురించి థ్రిల్లింగ్ పెద్ద తెరపై చూపించారు... 

Updated Date - 2021-12-31T04:15:38+05:30 IST