రేర్ పిక్: ఈ పిక్‌లో రౌండ్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా?

ABN , First Publish Date - 2021-08-06T22:03:22+05:30 IST

పై పిక్‌లో రౌండ్ చేసిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా? ఒక్కసారి తీక్షణంగా చూడండి. తెలుగు సినిమాని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడాయన. రాముడు, కృష్ణుడు వంటి దేవుళ్లు ఎలా ఉంటారు? అంటే ప్రతి ఒక్కరికి

రేర్ పిక్: ఈ పిక్‌లో రౌండ్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా?

పై పిక్‌లో రౌండ్ చేసిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా? ఒక్కసారి తీక్షణంగా చూడండి. తెలుగు సినిమాని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడాయన. రాముడు, కృష్ణుడు వంటి దేవుళ్లు ఎలా ఉంటారు? అంటే ప్రతి ఒక్కరికి మనసులో కదలాడే రూపం ఆయనదే. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రస్థానం భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. తెలుగువారంతా ఆప్యాయంగా ‘అన్నగారు’ అని పిలుచుకునే ఆ వ్యక్తి మరెవరో కాదు నటరత్న, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. పిక్ విషయానికి వస్తే.. ఇది ఎన్టీఆర్ కాలేజీ చదువుకునే రోజుల్లో తీయించుకున్న ఫొటో. అప్పుడు ఎన్టీఆర్ వయసు 16 సంవత్సరాలు. ఫ్యాంట్, షర్ట్, షర్ట్ పైన కోటు, షూస్, చేతికి గడియారంతో.. అప్పట్లోనే సినీ హీరోగా ఎన్టీఆర్ కనిపించారు. ఆ తర్వాత వెండితెరపై విశ్వరూపం చూపించిన విషయం అందరికీ తెలిసిందే.





Updated Date - 2021-08-06T22:03:22+05:30 IST