నా ‘Kaali’ క్వీర్, పితృస్వామ్యంపై ఉమ్మేస్తుంది: Leena Manimekalai

ABN , First Publish Date - 2022-07-09T22:53:20+05:30 IST

డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై (Leena Manimekalai) ‘కాళీ’(Kaali) టైటిల్‌తో సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌తో ఆమె తీవ్ర విమర్శలపాలైంది.

నా ‘Kaali’ క్వీర్, పితృస్వామ్యంపై ఉమ్మేస్తుంది: Leena Manimekalai

డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై (Leena Manimekalai) ‘కాళీ’(Kaali) టైటిల్‌తో సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌తో ఆమె తీవ్ర విమర్శలపాలైంది. హిందువుల మనో‌భావాలను కించపరిచారంటూ లీనాపై అనేక మంది ఫిర్యాదు చేశారు. ఆమెకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఆమెపై కేసును నమోదు చేశారు. ట్విట్టర్ కూడా ఆమె ట్వీట్‌ను డిలీట్ చేసింది.

 

లీనా మణి మేకలై విడుదల చేసిన పోస్టర్‌లో కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్టు ఉంది. వెనుక భాగంలో ఎల్‌జీబీ‌టీ (LGBT) కమ్యూనిటీకి చెందిన జెండా ఉంది.ఈ పోస్టర్ అనేక విమర్శలకు తావివ్వడంతో తన అభిప్రాయాలను లీనా మీడియాతో పంచుకుంది ‘‘నా కాళీ క్వీర్. స్వేచ్ఛ స్ఫూర్తితో ఉంటుంది. పితృస్వామ్యంపై ఉమ్మేస్తుంది. హిందూత్వను కూల్చేస్తుంది. పెట్టుబడిదారి విధానాన్ని నాశనం చేస్తుంది. వేయి చేతులతో ప్రతి ఒక్కరిని కౌగిలించుకుంటుంది’’ అని లీనా మణి మేఖలై చెప్పింది. (క్వీర్’ అంటే తమని తాము మగ అనిగానీ, మహిళ అనిగానీ అంగీకరించని వారు. అయితే, వీళ్లు  లెస్బియనో, హోమో సెక్సువల్ మగవారో కూడా కాదు. తమ జెండర్ విషయంలో ‘అయితే ఇటు-లేదా అటు’ అన్నట్టుగా తేల్చిచెప్పని వారు మాత్రమే!) 


లీనా ప్రచారం కోసమే ‘కాళీ’ పోస్టర్‌ను వివాదాలకు తావిచ్చేలా డిజైన్ చేసిందని మధ్య ప్రదేశ్ హోం శాఖ మంత్రి నరోత్తం మిశ్రా ఆరోపించారు. అంతటితో ఆగకుండా ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు లేఖ రాశారు. దీంతో ట్విట్టర్ ఆమె ట్వీట్‌ను డిలీట్ చేసింది. ప్రస్తుతం లీనా కెనడాలోని యార్క్ యూనివర్సిటీలో స్కాలర్ షిప్‌పై మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌ను చదువుతున్నారు. ‘కాళీ’ డాక్యుమెంటరీని లీనా టోరెంటోలోని అగా ఖాన్ మ్యూజియం ‘రిథమ్స్ ఆఫ్ కెనడా’ విభాగంలో ప్రదర్శించాలనుకున్నారు. కానీ, పోస్టర్ వివాదస్పదం కావడంతో మ్యూజియం డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌ను క్యాన్సిల్ చేసింది. 



Updated Date - 2022-07-09T22:53:20+05:30 IST