Rudrudu: లారెన్స్‌ రాఘవ ‘రుద్రుడు’ వచ్చేది అప్పుడే!

ABN , First Publish Date - 2022-07-04T00:59:36+05:30 IST

నటుడు – కొరియోగ్రాఫర్‌ – దర్శకుడు రాఘవ లారెన్స్‌ హీరోగా కతిరేసన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రుద్రుడు’. ‘ఈవిల్‌ ఈజ్‌ నాట్‌ బోర్న్‌, ఇట్‌ ఈజ్‌ క్రియేటడ్‌’ అనే ఉపశీర్షిక. ఈ ఏడాది క్రిస్మస్‌ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు గతంలో వెల్లడించిన నిర్మాతలు విడుదల తేదిని ఖరారు చేశారు.

Rudrudu: లారెన్స్‌ రాఘవ ‘రుద్రుడు’ వచ్చేది అప్పుడే!

నటుడు – కొరియోగ్రాఫర్‌ – దర్శకుడు రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) హీరోగా కతిరేసన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రుద్రుడు’. ‘ఈవిల్‌ ఈజ్‌ నాట్‌ బోర్న్‌, ఇట్‌ ఈజ్‌ క్రియేటడ్‌’ అనే ఉపశీర్షిక. ఈ ఏడాది క్రిస్మస్‌ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు గతంలో వెల్లడించిన నిర్మాతలు విడుదల తేదిని ఖరారు చేశారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. వైన్‌ బాటిల్‌ చేత పట్టుకొని సీరియస్‌గా చూస్తున్న లారెన్స్‌ లుక్‌ టెర్రిఫిక్‌గా ఉంది. (Priya bhavani shankar)

సీనియర్‌ నటుడు శరత్‌ కుమార్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. లారెన్స్‌ సరసన ప్రియా భవానీ శంకర్‌ కథానాయికగా నటిస్తోంది. జీవీ ప్రకాష్‌ కుమార్‌ స్వరాలందిస్తున్నారు. ఫైవ్‌స్టార్‌ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్పీ బ్యానర్‌పై కతిరేశన్‌ నిర్మిస్తున్నారు.  డిసెంబర్‌ 23న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఆదివారం ప్రకటించారు. (Rudrudu on 23 december)



Updated Date - 2022-07-04T00:59:36+05:30 IST