Lavanya tripati: ఓన్లీ లీగల్‌ పార్టీ.. జోష్‌ఫుల్‌ సాంగ్‌!

ABN , First Publish Date - 2022-07-05T02:34:03+05:30 IST

లావణ్య త్రిపాఠీ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘హ్యాపీ బర్త్‌ డే’. రితేష్‌ రానా దర్శకుడు. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తుంది. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.

Lavanya tripati: ఓన్లీ లీగల్‌ పార్టీ..  జోష్‌ఫుల్‌ సాంగ్‌!

లావణ్య త్రిపాఠీ (lavanya tripati)కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘హ్యాపీ బర్త్‌ డే’ (Happy birthday). రితేష్‌ రానా(Ritesh rana) దర్శకుడు. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తుంది. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా  సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలోని  ‘ఓన్లీ లీగల్‌ పార్టీ సాంగ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అంటూ సాగే జోష్‌ఫుల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. కాలభైరవ క్యాచీ ట్యూన్‌ ఇవ్వగా, దామిని భట్ల ఆలపించారు. కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించారు. ఈ పాటకు లావణ్య త్రిపాఠీ వేసిన డాన్స్‌ స్టెప్స్‌ ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. నరేష్‌ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్‌, గెటప్‌ శ్రీను తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 








Updated Date - 2022-07-05T02:34:03+05:30 IST