Lavanya Tripathi 'హ్యాపీ బర్త్ డే' రిలీజ్ డేట్ మారింది..

ABN , First Publish Date - 2022-06-25T17:44:22+05:30 IST

యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ హ్యాపీ బర్త్ డే (Happy Birth Day). తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 'మత్తు వదలరా' (Mathu Vadalara)

Lavanya Tripathi 'హ్యాపీ బర్త్ డే' రిలీజ్ డేట్ మారింది..

యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ హ్యాపీ బర్త్ డే (Happy Birth Day). తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 'మత్తు వదలరా' (Mathu Vadalara) ఫేమ్ రితేష్ రానా (Ritesh Rana) తెరకెక్కించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ (Vennela Kishore), కమెడియన్ సత్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థ్రిల్లర్ ఎంటర్టైనర్ నేపథ్యంలో ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తున్నారు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), బాలకృష్ణ (Balakrishna) లాంటి వారితో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూనే, యంగ్ హీరోలతోను మీడియం రేంజ్ సినిమాలను నిర్మిస్తున్నారు.


ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో హ్యాపీ బర్త్ డే చిత్రాన్ని నిర్మించగా, ముందు జూలై 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ, తాజాగా ఈ సినిమాను ఓ వారం ముందుగానే అంటే జూలై 8న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందించారు. లావణ్య త్రిపాఠి నటించిన గత చిత్రం చావుకబురు చల్లగా. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని చేసిన హ్యాపీ బర్త్ డే మూవీతో ఇప్పుడు ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.  

Updated Date - 2022-06-25T17:44:22+05:30 IST