Vikram: లేటెస్ట్ అప్‌డేట్..'సేవ్ ది డేట్'

ABN , First Publish Date - 2022-05-10T20:29:06+05:30 IST

విశ్వ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ విక్రమ్ (Vikram). తాజాగా ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. విశ్వరూపం 2

Vikram: లేటెస్ట్ అప్‌డేట్..'సేవ్ ది డేట్'

విశ్వ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ విక్రమ్ (Vikram). తాజాగా ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. విశ్వరూపం 2 (Vishwaroopam 2) తర్వాత కమల్ నుంచి మళ్ళీ ఇప్పటివరకు సినిమా ఏదీ రాలేదు. అటు సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నారు. అజిత్ కుమార్ (Ajith Kumar) కూడా సినిమా తర్వాత సినిమాను లైన్‌లో పెడుతూ బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సూర్య, కార్తి, విజయ్, ధనుష్, శివ కార్తికేయన్ లాంటి క్రేజీ హీరోలందరూ తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. 


కానీ, విశ్వనటుడే రేస్‌లో కాస్త వెనకబడ్డారు. వాస్తవంగా అయితే, క్రియేటివ్ జీనియస్ శంకర్ (Shankar) దర్శకత్వంలో కమల్ హీరోగా మొదలైన ఇండియన్ 2 (Indiyan 2) (భారతీయుడు 2) రావాల్సింది. కానీ, ఈ ప్రాజెక్ట్ దర్శక - నిర్మాతలకు మధ్య తలెత్తిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆగిపోయింది. ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుండటంతో యాక్షన్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ (Lokesh Kanag Raj) దర్శకత్వంలో విక్రమ్ సినిమాను కమిటయ్యారు కమల్. హీరోగా నటిస్తూ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో విక్రమ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్ మీడియాలో ఇచ్చారు. ఇందులో థియేట్రికల్ ట్రైలర్.. అలాగే, ఆడియో రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్ ఉన్నాయి. ఈ మే 15వ తేదీన విక్రమ్ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. అలాగే, అదే రోజు సాయంత్రం ఘనంగా ఆడియో లాంచ్ కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ 'సేవ్ ది డేట్' అంటూ ఓ పోస్టర్‌ను వదిలారు. కాగా, ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించాడు. ఇక ఇందులో కమల్‌తో పాటు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathy), ఫహద్ ఫాజిల్ (Fahad Fasil) కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ జూన్ 3న ప్రేక్షకులముందుకు రాబోతుంది విక్రమ్. 

Updated Date - 2022-05-10T20:29:06+05:30 IST