చిరు ‘గాడ్ ఫాదర్’ నుండి మరో అప్‌డేట్

ABN , First Publish Date - 2022-04-29T05:01:54+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న 153వ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ని ఖరారు చేసిన విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం

చిరు ‘గాడ్ ఫాదర్’ నుండి మరో అప్‌డేట్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న 153వ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ని ఖరారు చేసిన విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తుండగా.. టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే, స్టార్ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు యంగ్ హీరో సత్యదేవ్ ఈ చిత్రంలో కీలకమైన, పూర్తిస్థాయి పాత్రలో నటిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.


‘ఆచార్య’ సినిమాలో తను ఎంతగానో ఆరాధించే మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ స్పేస్ పంచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సత్యదేవ్ ట్వీట్ చేయగా.. మెగాస్టార్ చిరంజీవి కూడా వెంటనే ఆ ట్వీట్ కు రిప్లయ్ ఇచ్చారు. ‘ఆచార్య’లో నిడివి తక్కువ పాత్రలో సత్యదేవ్ నటించారని, ‘గాడ్ ఫాదర్’ సినిమాలో మాత్రం పూర్తి స్థాయిలో పవర్ ఫుల్ పాత్రలో సత్యదేవ్ నటించినందుకు సంతోషంగా ఉందని.. చిరు చెప్పుకొచ్చారు. కాగా, టాప్ టెక్నికల్ టీమ్ ‘గాడ్ ఫాదర్’ చిత్రం కోసం వర్క్ చేస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

Updated Date - 2022-04-29T05:01:54+05:30 IST