స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘‘ లక్కీమ్యాన్ ’’ ఫస్ట్‌లుక్ విడుదల

ABN , First Publish Date - 2022-01-01T02:15:04+05:30 IST

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో అక్టోబర్ 29న మరణిచారు. ఆయన జిమ్ చేస్తుండగా హఠాత్తుగా కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు

స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘‘ లక్కీమ్యాన్ ’’ ఫస్ట్‌లుక్ విడుదల

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో అక్టోబర్ 29న మరణిచారు. ఆయన జిమ్ చేస్తుండగా హఠాత్తుగా కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వేరే దగ్గరికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అనంతరం విక్రమ్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు.


స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘‘ లక్కీమ్యాన్ ’’ ఫస్ట్ లుక్ విడుదల అయింది. డార్లింగ్ కృష్ణ ఆ ఫోస్టర్‌ను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటో కింద క్యాప్షన్‌ను కూడా రాశారు. ‘‘ దేవుడు త్వరలో రాబోతున్నారు ’’ అని కామెంట్ చేశారు. డార్లింగ్ కృష్ణ, రోష్ని ప్రకాశ్ ఆ ఫస్ట్‌లుక్‌లో భార్యాభర్తలుగా కనిపించారు. పునీత్ రాజ్ కుమార్ ఆ చిత్రంలో దేవుని పాత్రను పోషించినట్టు తెలుస్తోంది.

 

ఆ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ అతిథి పాత్రలో మెరిసినట్టు శాండల్ వుడ్ మీడియా తెలుపుతోంది. సినిమాలో భాగంగా ప్రభుదేవాతో కలిసి పునీత్ ఒక పాటకు స్టెప్పులేశారు. ‘‘ లక్కీమ్యాన్’’ కు నాగేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. 2020లో విడుదలైన తమిళ చిత్రం ‘‘ఓ మై కాదువలే ’’ కు రీమేక్‌గా ‘‘ లక్కీమ్యాన్ ’’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో డార్లింగ్ కృష్ణ, రోష్ని ప్రకాశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మధ్యనే డార్లింగ్ కృష్ణ ‘‘ లక్కీమ్యాన్’’ కు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. పునీత్ రాజ్ కుమార్‌తో నటించిన ఒక సీన్‌ను ఆయన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 



Updated Date - 2022-01-01T02:15:04+05:30 IST