గతంలో ఆ వయస్సు నటీమణులకు అక్కడ చోటుండేది కాదు: మాజీ మిస్ యూనివర్స్

ABN , First Publish Date - 2022-03-01T17:09:05+05:30 IST

భారతీయ చిత్ర పరిశ్రమలో నటీమణుల పరిస్థితి అందరికీ తెలిసిందే. అక్కడ 30 ఏళ్లు దాటి 40కి సమీపించారంటే..

గతంలో ఆ వయస్సు నటీమణులకు అక్కడ చోటుండేది కాదు: మాజీ మిస్ యూనివర్స్

భారతీయ చిత్ర పరిశ్రమలో నటీమణుల పరిస్థితి అందరికీ తెలిసిందే. అక్కడ 30 ఏళ్లు దాటి 40కి సమీపించారంటే చాలు హీరోయిన్ల పని అయిపోయినట్టే. వారంతా తల్లి, అక్క, అమ్మమ్మ, నాన్నమ్మ పాత్రలు చేయాల్సిందే. ఇప్పుడైతే పరిస్థితి కొంచెం పర్వాలేదు. కానీ కొన్ని దశాబ్దాల క్రితం సిట్యువేషన్ వేరేలా ఉండేది. ఈ విషయం గురించే తాజా ఇంటర్వ్యూలో లారాదత్తా మాట్లాడింది.


లారా మాట్లాడుతూ.. ‘ఇటీవల నేను చేసిన కొన్ని చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు చూసినప్పుడు నాకు ఎంతో సంతృప్తిగా అనిపించింది. ఎందుకంటే నేను 40 ఏళ్ల వయస్సులో మహిళల పాత్రలో నటించాను. అది డేటింగ్ చేయడం దగ్గర నుంచి పోలీసు వరకూ క్యారెక్టర్స్‌లో నటించాను.


అది కూడా ప్రస్తుతం నా వయస్సులో ఉన్న వ్యక్తి ఎదుర్కొనే నిజమైన సమస్యల గురించి నటించాను. నేను ప్రస్తుతం చేస్తున్న పాత్రలు మూస ధోరణిలో లేవు. అంతేకాకుండా బెల్ బాటమ్ (2021) చేసిన క్యారెక్టర్‌కి దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్‌లో ఉత్తమ నటిగా సపోర్టింగ్ రోల్ అవార్డును గెలుచుకోగలిగాను’ అని చెప్పుకొచ్చింది.


గతంలో చిత్ర పరిశ్రమలో ఉన్న పరిస్థితుల గురించి లారా మాట్లాడుతూ.. ‘అప్పట్టో 35 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్నస్త్రీలు తెరపై చాలా అరుదుగా కనిపించేవారు. నిజం చెప్పాలంటే మేమున్నామని కూడా గుర్తించేవారు కాదు. అయితే 55 ఏళ్ల వయస్సు దాటితే మాత్రం అమ్మమ్మ, నాన్నమ్మ పాత్రలు ఇచ్చేవారు. అంతేకాకుండా 30 ఏళ్ల వయస్సులో ఉన్నప్పటికీ కొందరు హీరోల తల్లులుగా నటించారు. అలాగే దీర్ఘకాలంగా బాధపడుతున్న భార్య లేదా గర్లఫ్రెండ్‌గా చేసేవారు. అయితే ఈ జనరేషన్‌లో అందులో కొంచెం మార్పు వచ్చింది. సిరీయల్స్‌లో కోడలి పాత్రలు చేయనవసరం లేకుండా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించగలుగుతున్నాం’ అని తెలిపింది. అయితే ఈ లారా 2000లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో అత్యధికంగా మార్కులు సాధించి ఆ కిరీటాన్ని కైవసం చేసుకుంది.

Updated Date - 2022-03-01T17:09:05+05:30 IST