Lal Singh Chadda: స్పెషల్ ప్రీమియర్ షోకి టాలీవుడ్ స్టార్..

ABN , First Publish Date - 2022-08-07T16:57:35+05:30 IST

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ (Amir Khan) నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చడ్డా (Lal Singh Chadda). టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)

Lal Singh Chadda: స్పెషల్ ప్రీమియర్ షోకి టాలీవుడ్ స్టార్..

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ (Amir Khan) నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చడ్డా (Lal Singh Chadda). టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ స్టార్స్ కోసం ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ షోస్‌ని ప్రదర్శించారు. అద్వైత్ చందన్ (Adhvaith Chandan) దర్శకత్వం వహించిన ఈ మూవీని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయా కామ్ 18 స్టూడియోస్ సంస్థలు భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. నాగచైతన్య ఇందులో బోడి బాలరాజు అనే పాత్రను పోషించారు.


కరీనా కపూర్ (Kareena Kapoor).. ఆమిర్ ఖాన్‌కి జంటగా నటించింది. ఈ మూవీ అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమయింది. హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డా పాన్ ఇండియా స్థాయిలో ఈ ఆగష్టు 11న భారీ స్థాయిలో పలు భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్, నాగ చైతన్య, మెగాస్టార్ చిరంజీవి (Chiraneevi), మోనా సింగ్, అక్కినేని నాగార్జున (Nagarjuna), అమల ఈ చిత్రాన్ని వీక్షించారు. 


మూవీ చూసిన తర్వాత అందరి నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో లాల్ సింగ్ చడ్డా టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ సమర్పిస్తున్నారు. ఇది చిరు సమర్పణలో వస్తున్న 3వ సినిమా. మరి నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ చేసిన మొదటి సినిమా లాల్ సింగ్ ఛడ్డా..అటు బాలీవుడ్‌లో ఇటు సౌత్‌లో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకొని విజయం సాధిస్తుందో చూడాలి. 

Updated Date - 2022-08-07T16:57:35+05:30 IST