Honeymoon: జీరో బడ్జెట్‌తో నయన్-విఘ్నేశ్‌ల హనీ‌మూన్..!

ABN , First Publish Date - 2022-08-31T22:20:11+05:30 IST

సెలబ్రిటీ లవ్ బర్డ్స్ నయనతార (Nayanthara), విఘ్నేశ్ శివన్‌ (Vignesh Shivan)లు జూన్ 9న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మహాబలిపురంలోని ప్రముఖ రిసార్ట్‌లో వీరి వివాహం అత్యంత ఘనంగా

Honeymoon: జీరో బడ్జెట్‌తో నయన్-విఘ్నేశ్‌ల హనీ‌మూన్..!

సెలబ్రిటీ లవ్ బర్డ్స్ నయనతార (Nayanthara), విఘ్నేశ్ శివన్‌ (Vignesh Shivan)లు జూన్ 9న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మహాబలిపురంలోని ప్రముఖ రిసార్ట్‌లో వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది. నయన్-విఘ్నేశ్‌లు వివాహం తర్వాత హనీమూన్‌కు స్పెయిన్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి మాదిరిగానే హనీమూన్‌కు కూడా నయన్ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదట.    


నయన్, విఘ్నేశ్ శివన్‌ల పెళ్లికి సంబంధించిన అన్ని ఖర్చులను నెట్‌ఫ్లిక్సే (Netflix) చూసుకుంది. ఈ వేడుక డిజిటల్ రైట్స్ కోసం నయనతారకు రూ. 25కోట్లు చెల్లించిందని సమాచారం. హనీమూన్‌కు సంబంధించిన ఖర్చులను కూడా నెట్‌ఫ్లిక్సే చెల్లించిందని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. పెళ్లి మాదిరిగానే హనీమూన్ కోసం నయన్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని సమాచారం. నయనతార, విఘ్నేశ్ శివన్‌ల పెళ్లి వీడియో నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలోనే ప్రసారం కానుంది. ఈ వీడియోకు ‘నయనతార: బీయండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairy Tale) అని టైటిల్‌ పెట్టారు. ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ కానున్న ఫస్ట్ సెలబ్రిటీ పెళ్లి నయనతారదే కావడంతో అందుకోసం నెట్‌ఫ్లిక్స్ ఖర్చుకు వెనుకాడటం లేదు. వివాహంతో పాటు హనీమూన్ ఖర్చులను ఆ సంస్థ అందుకే భరించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పెళ్లికి విచ్చేసిన అతిథుల కోసం నయన్ మహాబలిపురం ఫైవ్ స్టార్ హోటల్‌లోని అన్ని గదులను బుక్ చేసిందట. ఈ వేడుక కోసం ఓ గ్లాస్ ప్యాలెస్‌ను కూడా నిర్మించారని కథనాలు వెలువడ్డాయి. ఒక ప్లేట్ భోజనానికి రూ.3500లను చెల్లించారని తెలుస్తోంది. ఖరీదైన మేకప్ ఆర్టిస్టులు, ముంబై నుంచి వచ్చిన సెక్యూరిటీ గార్డులు కోసం భారీగానే ఖర్చు చేశారట. స్టైలిష్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఈ పెళ్లికి దర్శకత్వం వహించాడని సమాచారం.



Updated Date - 2022-08-31T22:20:11+05:30 IST