పెళ్లి ద్వారా Nayanthara భారీగా అర్జించిందా..?

ABN , First Publish Date - 2022-06-12T20:52:50+05:30 IST

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), ప్రియుడు విఘ్నేశ్ శివన్‌ను (Vignesh Shivan) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మహాబలిపురంలోని ప్రముఖ రిసార్ట్‌లో జూన్ 9న వీరి వివాహం ఘనంగా

పెళ్లి ద్వారా Nayanthara భారీగా అర్జించిందా..?

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), ప్రియుడు విఘ్నేశ్ శివన్‌ను (Vignesh Shivan) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మహాబలిపురంలోని ప్రముఖ రిసార్ట్‌లో జూన్ 9న వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి నెట్‌ఫ్లిక్స్‌(Netflix) లో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ వివాహానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం భారీ ధర చెల్లించి సొంతం చేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వేడుక మీద నయనతార ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదట. పెళ్లికి సంబంధించిన పూర్తి ఖర్చులను నెట్‌ఫ్లిక్సే చూసుకుందని సమాచారం. 


వివాహానికి సంబంధించిన ఖర్చులను చూసుకోవడంతో పాటు ఈ వేడుక డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ నయనతారకు రూ. 25కోట్లు చెల్లించిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అతిథుల కోసం నయన్ మహాబలిపురం ఫైవ్ స్టార్ హోటల్‌లోని అన్ని గదులను బుక్ చేసిందట. ఈ వేడుక కోసం ఓ గ్లాస్ ప్యాలెస్‌ను కూడా నిర్మించారని కథనాలు వెలువడుతున్నాయి. ఒక ప్లేట్ భోజనానికి రూ.3500లను చెల్లించారని తెలుస్తోంది. ఖరీదైన మేకప్ ఆర్టిస్టులు, ముంబై నుంచి వచ్చిన సెక్యూరిటీ గార్డులు కోసం భారీగానే ఖర్చు చేశారట. స్టైలిష్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఈ పెళ్లిని దర్శకత్వం వహించాడని సమాచారం. ఒక వేళ ఈ వదంతులు కనుక నిజమయి పెళ్లి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే మొదటి భారతీయ సెలబ్రిటీ జంటగా నయన్- విఘ్నేశ్ నిలుస్తారు. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ‘నేను రౌడినే’ సినిమాలో నయన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం చేస్తున్నప్పుడు వీరికి పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తాజాగా మూడు ముళ్ల బంధంలో ఒక్కటయ్యారు. గతంలో విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ పెళ్లికి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను రూ. 100కోట్లు చెల్లించి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2022-06-12T20:52:50+05:30 IST